తెలంగాణ

బాసరలో సుజనాచౌదరి పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, ఆగస్టు 17: ప్రసిద్ధ ణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతిదేవి ఆలయంలో కేంద్ర, రాష్ట్ర సాంకేతిక, విజ్ఞానశాఖ మంత్రి వై.సుజనాచౌదరి కుటుంబ సమేతంగా గురువారం పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రి కుటుంబ సభ్యులను ఆలయ అధికారులు, అర్చకులు మంగళవాయిద్యాలతో వేదపండితుల మంత్రోచ్చరణాలతో పూర్ణకుంభస్వాగతం పలికారు. అమ్మవారి వెయ్యిరూపాయల అక్షరాభ్యాస మండపంలో కేంద్రమంత్రి మనుమడుకి ఆలయ స్థానాచార్యుడు ప్రవీన్‌పాఠక్ చేతుల మీదుగా అక్షరాభ్యాస పూజలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయంలో కొలువుదీరిన సరస్వతి మహాలక్ష్మి అమ్మవార్లను దర్శించుకుని కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శరత్‌పాఠక్, ఆలయ ప్రత్యేకాధికారి, డిప్యూటీ కలెక్టర్ ఎ.సుధాకర్‌రెడ్డి కేంద్ర మంత్రి వై.సుజనాచౌదరిని పట్టువస్త్రాలతో సత్కరించారు.