తెలంగాణ

సిబిఐ విచారణలో 150 మంది అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: దేశంలో పెద్ద నోట్ల రద్దు అనంతరం జరిగిన కోట్లాది రూపాయల అక్రమ లావాదేవీల్లో దాదాపు 450 మంది ప్రభుత్వ, ప్రభుత్వ రంగ అధికారులు, ప్రైవేటు వ్యక్తులపై విచారణ కొనసాగుతోంది. వీరిలో 150 మంది బ్యాంకులు, బీమా, పోస్ట్ఫాసు, రైల్వే, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, మరో 300 మంది ప్రైవేట్ వృత్తుల్లో అంటే ట్యాక్స్ కనె్సల్టెంట్లు, అకౌంటెంట్లు, ఆభరణాల వ్యాపారులు తదితరులు ఉన్నారు. సిబిఐ విచారిస్తున్న వారిలో అధికంగా బ్యాంకు అధికారులే కావడం గమనార్హం.
దాదాపు 70 కేసులను ఒక్క సిబిఐ దేశ వ్యాప్తంగా నమోదు చేస్తే వాటిలో 53 కేసులు బ్యాంకులకు చెందినవే ఉన్నాయి. పెద్ద నోట్లు రద్దు అనంతరం భారీగా నగదును బ్యాంకుల్లో జమ చేసిన సమయంలో బ్యాంకు అధికారులు కొందరు కీలక పాత్ర వహించినట్లు ఆరోపణలు రావడంతో సిబిఐ రంగంలో దిగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, పోస్ట్ఫాసులు, బీమా, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున రద్దయిన నోట్లు డిపాజిట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గత ఏడాది నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 వరకు ఇచ్చిన గడువులో రద్దయిన పెద్ద నోట్లను భారీగా డిపాజిట్లు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై సిబిఐ అధికారులు విచారణ ప్రారంభించారు. బంగారం వ్యాపారులు, కొన్ని షెల్ కంపెనీలు, దళారులు వంటి వారి ఖాతాల్లో పెద్ద ఎత్తున నగదు చేరిన వైనంపై దర్యాప్తు చేసి కేసులు నమోదు చేశారు. సిబిఐ దర్యాప్తులో వివిధ వర్గాల నుంచి దాదాపు రూ.36 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా కొన్ని సహకార బ్యాంకుల్లో కూడా నగదు మార్పిడి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మరికొన్ని చోట్ల అక్రమంగా రద్దయిన నోట్లను తరలిస్తుండగా పోలీసు అధికారులు పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. పెద్ద నోట్లు రద్దయిన అనంతరం నమోదైన కేసుల్లో దేశవ్యాప్తంగా చాలా మందిని సిబిఐ, స్ధానిక పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం సిబిఐ 55 కేసులను విచారిస్తుండగా, సుమారు 12 చార్జిషీట్లను దాఖలు చేసింది. త్వరగా ఈ కేసులన్నింటిని ఒక కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.