విజయనగరం

ఎదురుచూపులేనా...!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: టిడిపి సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటికీ అనుబంధ కమిటీల నియామకాలు నేటి వరకు జరగలేదు. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి ఎదురుకాలేదు. నేడు జిల్లాలో కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు సుజయ్‌కృష్ణ రంగారావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నప్పటికీ పార్టీలో ఏ నిర్ణయాన్ని త్వరితగతిన తీసుకోలేకపోతున్నారు. గతంలో జిల్లా కమిటీ, అనుబంధ కమిటీలను మహానాడుకు ముందర ప్రకటించగా, ఈ ఏడాది మహానాడు సభ ముగిసి దాదాపు మూడు నెలలు కావస్తున్నా అనుబంధ కమిటీల నియామక ప్రక్రియ మాత్రం జరగలేదు. ఎప్పుడు ప్రకటిస్తారన్నదీ కూడా ఇతమిద్ధంగా తెలియడం లేదు. ఈ కమిటీలే వచ్చే సాధారణ ఎన్నికల వరకు ఉంటాయనడంతో ఎవరికి పదవులు కట్టబెట్టాలన్నదీ నేతలు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆయా కమిటీలకు సరైన వ్యక్తులను ఎంపిక చేయాలన్న ఉద్దేశంతో నెలల తరబడి తాత్సారం చేస్తున్నారు.
టిడిపి జిల్లా కమిటీలో అధ్యక్షుడిగా మహంతి చిన్నంనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఐవిపి రాజులను మినహా మిగిలిన కమిటీ సభ్యులను నేటి వరకు ప్రకటించలేదు. జిల్లా కమిటీ, తెలుగు యువతలో ఒక్కొ కమిటీలో 45 మంది సభ్యులు ఉంటారు. మిగిలిన అనుబంధ కమిటీలలో ఒక్కొ దానికి 25 మంది సభ్యులు ఉంటారు. ఈ విధంగా జిల్లాలోని తెలుగుదేశం పార్టీలో 400 మందికి పదవులు కట్టబెట్టాల్సి ఉండగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోవడం గమనార్హం. జిల్లా కమిటీ, తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగు రైతు, సాంస్కృతిక విభాగం, ఎస్సీ విభాగం, ఎస్టీ విభాగం, ఇలా దాదాపు 14 కమిటీలకు సభ్యులను నియమించాల్సి ఉంది. కాగా, వీటిలో ఇతర కమిటీలు పూర్తయినప్పటికీ తెలుగు యువత అధ్యక్ష పదవిని ఎవరికి ఖరారు చేయాలనే అంశంపై నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటంతో తెలుగు యువతను ఖరారు చేయలేదు. మరోపక్క ఏ నియోజకవర్గానికి ఈ పదవిని కట్టబెట్టాలనే విషయంలో కూడా మీమాంస నెలకొంది. దీనిపై జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడును అడగ్గా దాదాపు 95 శాతం పేర్లు ఖరారయ్యాయని అంటున్నారు. మరి ఎందుకు వాటిని ప్రకటించలేదని అడగ్గా త్వరలోనే ప్రకటిస్తామని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటకీ అనుబంధ కమిటీల పేర్లను ఖరారు చేయకపోవడంతో ఆ పార్టీలో పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.