శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

22 మంది కాంట్రాక్టు కార్మికులకు ఉద్వాసన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు: ఆత్మకూరు పురపాలక సంఘ పరిధిలో 22 మంది కాంట్రాక్టు కార్మికులకు ఉద్వాసన పలికిన వైనంపై కలకలం చోటుచేసుకుంటోంది. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారిలో 22 మందికి గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. వీరంతా మున్సిపల్ కమిషనర్ చెప్పినట్లు విధులు నిర్వహించనందునే వేటు పడినట్లు తెలియవచ్చింది. అయితే మిగిలిన కాంట్రాక్ట్ సిబ్బందితో వీరికి జీతాల చెల్లింపును చేయక నిలిపివేయడం ద్వారా సాగనంపేలా నిర్ణయం తీసుకున్నారు. ఇదేమని సదరు సిబ్బంది ప్రశ్నించిన సందర్భంలో నిధుల లేమిగా చెప్తున్నారు. అలాగే తాము చెప్పినట్లుగా విధులు నిర్వహిస్తేనే జీతాల చెల్లింపు చేయగలమంటూ కూడా కమిషనర్ స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలంటారు. మున్సిపాలిటీలోకి సిబ్బందిని నియమించుకున్న తొలినాళ్ల నుంచి నిబద్ధత ప్రదర్శించలేదు. కౌన్సిల్ సమావేశంలో పారిశుద్ధ్య విధులకు వినియోగించుకోవడానికి అంటూ ఈ నియామకాలు జరిగాయి. కౌన్సిల్ తీర్మానం ఆసరా చేసుకుని రాజకీయ సిఫారసులతో ఆఘమేఘాలపై హడావుడిగా నియమించుకున్నారు. అలా చేరిన వారిలో 8 మందిని కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో, నలుగుర్ని వీధి దీపాలకు సంబంధించి, మరో పదుగుర్ని నీటి సరఫరా విభాగంలో ఇన్నాళ్లు కొనసాగించారు. ఇప్పుడు వారు పారిశుద్ధ్య విభాగంలోకి వెళ్లేందుకు ముందుకు రావడంలేదు. తమ పట్ల తారతమ్యం చూపుతున్నారనే నిరసన భావం కూడా కొంతమంది నుంచి వ్యక్తమవుతోంది. గతంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగిరపరిచే పేరిట పలువురు సిబ్బందిని వినియోగించుకున్నారు. ఏదేమైనా నిరుద్యోగులతో ఆటలాడుకోవడం తగదనే అభిప్రాయాలు సైతం వినవస్తున్నాయి. ఇదిలాఉంటే కొంతమంది మాత్రం నాలుగు నెలల జీతం నిలుపుదల చేసినా ఇంకా విధుల్లో కొనసాగుతూనే ఉన్నారు. ఆత్మకూరు పట్టణానికి సోమశిల నుంచి వచ్చే నీటిని స్థానికంగా శుద్ధిచేసే ప్లాంట్ వద్ద బయోకెమిస్ట్రీ విద్యార్హత గల ఓ టెక్నిషియన్ గతంలో విధులు నిర్వహించాడు. ఇతన్ని సైతం ఇంతకుముందే పురపాలక వర్గ పోరు కారణంగా తొలగించారు. ఈ ప్రభావంతో నిత్యం నీటి సరఫరాలో అనేక తప్పిదాలు చోటుచేసుకుంటూ ఆ నీటి పథకమే దండగ అనే భావన జనంలో వ్యక్తమవుతోంది.