తెలంగాణ

మహిళల రక్షణకు ప్రత్యేక హెల్ప్‌లైన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: మహిళల రక్షణకు ప్రత్యేకంగా ‘మహిళా హెల్ప్‌లైన్-181’ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మహిళలకు సలహాలు ఇచ్చేందుకు, కౌన్సిలింగ్ నిర్వహించేందుకు, రక్షణ కోసం ఈ హెల్ప్‌లైన్ ఉపయోగపడుతుంది. రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఈ హెల్ప్‌లైన్‌ను సచివాలయంలో ప్రారంభించారు. రాష్ట్రంలో మహిళలు ఎవరూ రక్షణ కరవై కన్నీరు పెట్టకూడదన్న ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టామని మంత్రి పేర్కొన్నారు. ఈవ్ టీజర్ల నుండి మహిళలకు రక్షణ కల్పించేందుకు ఇప్పటికే ‘షీ టీమ్స్’ను ఏర్పాటు చేసి, విజయం సాధించామని గుర్తు చేశారు. అదే విధంగా రక్షణ కోరుకునే మహిళ ఎవరైనా 181 కు ఫోన్ చేయవచ్చని, ఈ ఫోన్ 24 గంటలూ, 365 రోజులూ పనిచేస్తుందని వివరించారు. బాధల్లో ఉన్న మహిళలకు సఖీ సెంటర్లలో రక్షణ కల్పిస్తామని, వైద్యసౌకర్యాలు కల్పిస్తామని, పోలీసు ద్వారా రక్షణ కల్పిస్తామని వివరించారు. గృహహింస, పనిచేసే చోట వేధింపులు, లైంగిక వేధింపులు, వరకట్నపు వేధింపులు, ఆడపిల్లల అమ్మకం, రవాణా తదితర అంశాల్లో ఈ హెల్ప్‌లైన్ ఉపయోగపడుతుందని తుమ్మల తెలిపారు. ప్రభుత్వం కల్పించిన ఈ సౌకర్యం గురించి రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళకు సమాచారం అందించే బాధ్యతను అధికారులు తీసుకోవాలని మంత్రి కోరారు.
181 హెల్ప్‌లైన్ ప్రతిశాఖకు అనుసంధానం చేశామని మహిళా కార్పోరేషన్ చైర్‌పర్సన్ గుండు సుధారాణి ఈ సందర్భంగా తెలిపారు. జివికె-ఇఎంఆర్‌ఐ సంస్థ నుండి సాంకేతిక సహకారం తీసుకుంటామని మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి జగదీశ్వర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో దీన్ని ప్రారంభించామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సి కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, మహిళా సంక్షేమ డైరెక్టర్ విజయేందిర బోయి, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సచివాలయంలో శనివారం ‘మహిళా హెల్ప్‌లైన్-181’ను ప్రారంభిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరావు