కరీంనగర్

దేశాభివృద్ధికి సామాజిక శాస్తవ్రేత్తలుగా ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: దేశం శరవేగంగా అభివృద్ధి సాధించాలంటే విద్యార్థులు భవిష్యత్‌లో మంచి సామాజిక శాస్తవ్రేత్తలుగా ఎదగాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆకాంక్షించారు. గత టెన్త్ ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా రెండవ స్థానంలో నిలిచిందని, ఇది జిల్లా ప్రజలందరికీ గర్వకారణమన్నారు. విద్యార్థులకు ఇంకా మెరుగైన విద్యనందించి వచ్చే పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లాను నెంబర్ వన్‌గా నిలుపాలని కోరారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో 2016-17 సంవత్సరంలో పదవ తరగతి ఫలితాల్లో 10జిపిఏ, 9.8జిపిఏ మార్కులు సాధించిన విద్యార్థులు, వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను మంత్రి, కలెక్టర్, ఎంపి, జడ్పీ చైర్‌పర్సన్ తదితరులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ విద్య, వైద్యంపై ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వౌళిక వసతుల కల్పన, మరమ్మత్తులు, పరికరాల కొనుగోలుకు ఒకే రోజు రూ.10కోట్లు మంజూరు చేయించామన్నారు. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో కాంపౌండ్ వాల్స్, టాయిలెట్లు, విద్యుత్, గేట్లు తదితర సదుపాయాలకు ఒక్కొ నియోజకవర్గానికి నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. ప్రైవేటు, కార్పోరేట్ విద్య కన్న ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, మెరుగైన విద్యనందిస్తుందన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో 560 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందన్నారు. రేపటి మెరుగైన సమాజాభివృద్ధికి గత పదవ తరగతి పరీక్షలే నిదర్శనమన్నారు. గత పరీక్షలలో ఉత్తీర్ణత శాతంతోపాటు విద్యా ప్రమాణాలు పెరిగినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులందరు పేద కుటుంబాల వారేనని, వారందరికీ తల్లిదండ్రుల కష్టసుఖాలు తెలిసి ఉంటాయని, అందుకే ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకొని ఇప్పటినుండే ప్రతీ ఒక్కరు సివిల్ సర్వీసెస్ (ఐఎఎస్) వైపు అడుగులు వేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అప్పుడే తమ తల్లిదండ్రులు కన్న కలలు నెరవేరడంతో పాటు మీ భవిష్యత్ బాగుంటుందని మంత్రి అన్నారు. రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ నేటి విద్యార్థులు సమాజంలో సంస్కరణలు తెచ్చే భావి భారత పౌరులుగా ఎదగాలన్నారు. పట్టుదలతో, ప్రణాళికాబద్ధంగా చదివితే ఎన్ని ర్యాంకులైనా సాధించవచ్చన్నారు. కరీంనగర్ ఎంపి వినోద్‌కుమార్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కరీంనగర్ జిల్లా విద్యా రంగంలో దేశానికే దిక్సూచి కావాలన్నారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ ప్రతీ పాఠశాలకు దత్తత అధికారిని నియమించి వారి పర్యవేక్షణలో ప్రత్యేక తరగతులు, స్లిప్ టెస్ట్‌లు, పిల్లలతో మాట్లాడించడం, రోజు రాయించే అలవాటు చేయించడం వల్ల టెన్త్ ఫలితాల్లో జిల్లా రెండవ స్థానంలో నిలిచిందన్నారు. గత పరీక్షలో జిల్లాలో 10జిపిఎ 16మంది, 9.8జిపిఎ 35 మంది సాధించారని వివరించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఇలాంటి సన్మానాలు చేయడం వల్ల మిగిలిన వారికి స్పూర్తినిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్ సింగ్, గ్రంధాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపిపి వాసాల రమేష్, జిల్లా విద్యాధికారి రాజీవ్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.