గుంటూరు

అమ్మకానికి సిద్ధమైన గణనాధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్): తొలి పూజలందుకోవడానికి, అందరి ఇంటా ఇలవేల్పుగా ప్రతినిత్యం అర్చించబడుతున్న, నవవిధ సుందర గణపతులు విభిన్న ఆకృతుల్లో బాద్రపధ శుద్ధచవితి నాడు వినాయక చవితి ఉత్సవాల వేదికపై పూజలందుకోవడానికి సిద్ధమైనారు. విజయవాడ, హైదరాబాద్‌లోని సనత్‌నగర్, ధూల్‌పేట, నెల్లూరు, ఇబ్రహింపట్నం, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో అందంగా తయారు చేయబడిన 12 రకాల విఘ్నరాజు ప్రతిమలు నగరానికి ఇప్పటికే చేరుకోగా ఆదివారం సెలవుదినం కావడంతో అధిక సంఖ్యలో ఉత్సవ సంఘాల ప్రతినిధులు ఏకదంతుని ప్రతిమలను కొనుగోలు చేశారు. గోరంట్ల, హిందూ కాలేజీసెంటర్, మార్కెట్ సెంటర్, ఆటోనగర్, రింగ్‌రోడ్డు, నల్లపాడు తదితర ప్రాంతాలకు 2500కు పైగా గణనాధుని ప్రతిమలు చేరుకోగా గత రెండు రోజులుగా అమ్మకాలు ప్రారంభమైనాయి. 3 అడుగుల నుంచి 12 అడుగుల సైజులో తయారు చేసిన ఈ ప్రతిమలు 3 వేల నుంచి 16 వేల రూపాయల వరకు ధర పలుకుతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ఈ ఏడాది పెద్దపీట వేసి కెమికల్స్ శాతాన్ని విగ్రహాల తయారీలో పూర్తిగా తగ్గించామని, మట్టి, వాటర్ పెయింటింగ్స్‌తో అందంగా తీర్చిదిద్దామని పలువురు తయారీదారులు ఈ విలేఖరికి తెలిపారు. 22వ తేదీ మంగళవారం మఘా నక్షత్రంతో బాద్రపదమాసం ప్రారంభమవుతుంది. 25వ తేదీ శుక్రవారం హస్తానక్షత్రం, చవితి ఘడియల ప్రవేశ సమయంలో శుభ ముహూర్తాన చవితి వేడుకలను జరుపుకోనున్నారు.
సేవాభావంతో పనిచేయాలి
నరసరావుపేట: ఎలాంటి సంస్థలు ఏర్పాటు చేసినా, అందరూ సేవాభావంతో పనిచేయాలని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. స్థానిక సత్తెనపల్లిరోడ్డులోని విజయకల్యాణ మండపంలో ఆదివారం జరిగిన గుంటూరు జిల్లా వాసవి సేవా సమితిల సమాఖ్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సమాఖ్య వ్యవస్థాపకులు చీతిరాల గురుపెద్దన్న అధ్యక్షత వహించారు. తాను ఆర్యవైశ్య మహాసభను రెండు సంవత్సరాలు నిర్వహించానని, దాని వల్ల తనకు తలప్రాణం తోకకు వచ్చిందని వివరించారు. ఆర్యవైశ్య మహాసభ కొద్ది కాలం నిలిచిపోయిందని, అనంతరం 1975లో తిరిగి నూతన జవసత్త్వాలను అందించడం జరిగిందన్నారు. వైశ్యుల సమస్యల పరిష్కారానికి ఇలాంటి సంస్థలు పనిచేయాలన్నారు. పాత, కొత్త మిత్రులను కలుసుకునే మహత్తర అవకాశం లభించిందని రోశయ్య అనందం వ్యక్తం చేశారు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, ఇలాంటి కార్యక్రమాలను ఆపటానికి, తగ్గించడానికి చేతకావడం లేదన్నారు. సమాఖ్యల వ్యవస్థాపక అధ్యక్షుడు చీతిరాల గురుపెద్దన్న తన చేతుల మీదుగా 14 సంస్థ్ధలు స్థాపించి, నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ కాకుమాను పెద పేరిరెడ్డి, కపలవాయి విజయకుమార్, పి వెంకటేశ్వర్లు, నాగసరపు సుబ్బరాయగుప్తా, మిట్టపల్లి వెంకటకోటేశ్వరరావు, భవనాశి యల్లారావు, కట్టమూరు శంకరరావు, మిరియాల హరి, వనమా సుబ్బారావు, ఎంఆర్‌కె మూర్తి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా వాసవి సేవా సమితిల సమాఖ్య కార్యవర్గ సభ్యులు లక్ష్మీపూర్ణచంద్రరావు, పల్లబోతు రమేష్, కొత్తూరి ప్రదీప్ కుమార్, చందోలు ప్రకాశరావులచే ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారికి పూలమాలలు వేసి, నివాళి అర్పించారు.

రేపు కేంద్ర మంత్రి నడ్హా రాక
గుంటూరు (పట్నంబజారు): పేదలకు సంక్షేమ ఫలాలు అందేలా చూడటమే కేంద్రప్రభుత్వ లక్ష్యమని బిజెపి నగర అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు పేర్కొన్నారు. స్థానిక అరండల్‌పేటలోని నగర పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022 నాటికి నవభారత నిర్మాణం కోసం ఒక సంకల్పాన్ని అందరూ తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారన్నారు. అందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లోని పార్లమెంటు నియోజకవర్గాలోల కేంద్రమంత్రులు పర్యటిస్తారన్నారు. ఈ నెల 22న కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్హా నగరంలో పర్యటించనున్నారన్నారు. స్థానిక అమరావతి రోడ్డులోని హిందూ కాలేజీ ఆఫ్ ఫార్మసీలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సమీక్షిస్తారన్నారు. మంత్రి పర్యటనను బిజెపి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు గండవరపు జగన్, ఆలూరి కోటేశ్వరరావు, తోట రామకృష్ణ, అప్పిశెట్టి రంగారావు, పరసా కోటేశ్వరరావు, వెలగలేటి గంగాధర్, కస్తూరి సైదులు తదితరులు పాల్గొన్నారు.

మానవాళికి మార్గదర్శి హిప్నాటిజం
గుంటూరు (పట్నంబజారు): పూర్వకాలంలో మానవులను సక్రమమైన మార్గంలో నడిపించేందుకు ఎందరో గురువులు అనేక బోధనలు చేశారని, నేడు ఆ బాధ్యతను హిప్నాటిజం, ఎన్‌ఎల్‌పి తీసుకుందని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ హిప్నో కమలాకర్ పేర్కొన్నారు. స్థానిక పాత గుంటూరులోని ఉర్దూ బాలుర హైస్కూల్ సమావేశ మందిరంలో హిప్నాటిజం, ఎన్‌ఎల్‌పి అంటే ఏమిటి అనే అంశంపై సైకాలజిస్ట్‌లకు ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ ప్రస్తుత ఆధునికయుగంలో మనిషి కాలంతో పాటు పరిగెడుతూ మానసిక ప్రశాంతతను కోల్పోతున్నాడన్నారు. నిత్యం ఒత్తిడి, టెన్షన్ వంటి మానసిక సమస్యలతో సహవాసం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారన్నారు. విద్యార్థినీ, ఏకాగ్రత లోపం, మతిమరుపు, పరీక్షలంటే భయం, వేగంగా రాకలేక పోవడం, చదవలేకపోవడం వంటి సమస్యలను విద్యార్థులు స్వీయసాధన ద్వారా అధిగమించడానికి హిప్నాటిజం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు, కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ అనంతకుమార్, ఉపాధ్యక్షురాలు కాపు శ్యామల, బి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. హాజరైన వారికి హిప్నాటిజం, ఎన్‌ఎల్‌పి ప్రాక్టికల్‌గా చేసిచూపారు. అనంతరం పలువురు అడిగిన సందేహాలను కమలాకర్ నివృత్తిచేశారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయం
గుంటూరు (పట్నంబజారు): ఉద్యోగుల సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని ఎపి జెఎసి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక రెవెన్యూ భవన్‌లో ఎపి రాష్ట్ర పంచాయతీరాజ్ గవర్నమెంటు మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అమరావతి నూతన రాష్ట్ర కార్యవర్గ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ సంఘం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ సమష్ఠిగా ఉంటే సమస్యలు అవే పరిష్కారమవుతాయన్నారు. అనంతరం సంఘ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎ వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శిగా ఎస్ నబీ అహ్మద్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కె శ్రీనివాసరావు, అసోసియేట్ అధ్యక్షుడుగా కెఎస్‌కె శోభారాణి, కె భీమలింగేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా బివి సాయికుమార్, షేక్ రబ్బాని, టి శ్రీనివాసరావు, టివి రత్నకుమార్, ఎం సుబ్బారావు, జాయింట్ సెక్రటరిలుగా షేక్ బాజి, ఆర్‌వి రాంబాబు, టి హనుమంతరావు, ఎ గీత, కార్యవర్గ సభ్యులుగా సిహెచ్ పేరయ్య, మల్లి, ఎస్ సాంబశివరావు, రాజు, జికె కమాతి, జి శ్రీనివాసరావు, జె సుహృదయం, ఎ రవి, కె నాగరాజు, శశికళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి మాట్లాడుతూ తమ శాఖలో ఉద్యోగులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

మజ్దూర్ల వైఖరితో ఆర్టీసి కార్మికులకు నష్టం
మంగళగిరి: ఆర్‌టిసి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ యాజమాన్యాలపై ఒత్తిడి చేయకుండా గుర్తింపు సంఘం ఎన్‌ఎంయు నేతలు అనుసరిస్తున్న వైఖరి ఫలితంగా కార్మికులు నష్టపోతున్నారని ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పి దామోదరరావు ధ్వజమెత్తారు. ఆదివారం మంగళగిరి డిపోలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు విచ్చేసిన దామోదరరావు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచి 17 నెలలు గడిచినా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఎన్‌ఎంయు కార్మికులను యాజమాన్యానికి తాకట్టు పెడుతోందని దామోదరరావు విమర్శించారు. నష్టాల పేరుతో ఆర్‌టిసిలో పల్లెవెలుగు బస్సులను తగ్గిస్తూ ప్రజా రవాణాకు ఆర్‌టిసిని దూరం చేస్తున్నారని, నష్టాలకు కార్మికులు కారణం కాకపోయినా సిబ్బందిని కుదించి అధికారులను పెంచుకుంటున్నారని ఆయనన్నారు. రోజురోజుకూ సిబ్బందిపై పనిభారాలు పెంచుతున్నా ఎన్‌ఎంయు వౌనంగా ఉంటోందని ఆయనన్నారు. బోర్డులో డైరెక్టర్ల పదవులకోసం కార్మికుల సమస్యలను పట్టించుకోని ఎన్‌ఎంయుకి కార్మికులే బుద్ధి చెబుతారని ఆయనన్నారు. ఇయు జోనల్ అధ్యక్షుడు కృష్ణారావు, జిల్లా కార్యదర్శి చిన్ని సత్యనారాయణ, డిపో కార్యదర్శి మనోరంజన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

హత్య కేసు నిందితుల అరెస్ట్
గుంటూరు (పట్నంబజారు): మహిళను హత్య చేసిన కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు రూరల్ ఎస్‌పి సిహెచ్ వెంకటప్పల నాయుడు తెలిపారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నర్సరావుపేట రూరల్ పరిధిలోని ఎస్‌ఆర్‌కెటి కాలనీలో నివశిస్తున్న రేపూరి లక్ష్మిని నిందితులైన సీతబోయిన నాగశేషు, వాకా కోటేశ్వరి, అత్తిలి లక్ష్మణరావు, కొమ్ము ఏబు ఓ పథకం ప్రకారం హతమార్చారన్నారు. హతురాలు లక్ష్మి హ్యాండ్స్ ఆఫ్ కాంపేషన్ సంస్థలో పీర్ ఎడ్యకేటర్‌గా పనిచేసేదని, అప్పుడప్పుడూ అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ ఉండేదన్నారు. ఈ క్రమంలో వాకా కోటేశ్వరికి సీతబోయిన నాగశేషు పరిచయమయ్యాడని, ఆ క్రమంలో నాగశేషు తనకు కూడా అమ్మాయిలు కావాలని వేధించసాగాడు. దీంతో అతని ఒత్తిడి తట్టుకోలేక నాగశేషుపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అతన్ని అరెస్ట్‌చేసి జైలుకుపంపారు. దీంతో కక్ష పెంచుకున్న నాగశేషు ఆమెను జూలై 30వ తేదీన ప్రకాష్‌నగర్‌లో వాకా కోటేశ్వరి, అత్తిలి లక్ష్మణరావు, కొమ్ము ఏబుల సాయంతో హతమార్చాడు. నిందితులను పోలీసులు ఆదివారం మధ్యాహ్నం నర్సరావుపేటలో అదుపులోకి తీసుకున్నారు.