తెలంగాణ

నదీ జలాలను దామాషా ప్రకారం రాష్ట్రాలకు కేటాయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 20: దేశంలో ఉన్న నదీజలాలను దామాషా ప్రకారం రాష్ట్రాలకు కేటాయించే విధానాన్ని కేంద్ర నీటి సంఘం చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని సిపిఎం కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నాగార్జునసాగర్ డ్యాంలో నీటిని దామాషా ప్రకారం తీసుకోవాలని ఆదేశించిన కృష్ణానదీజలాల బోర్డు ఆదేశించినప్పుడు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలను కూడా ఎందుకు ఆదేశించదని ప్రశ్నించారు. సాగర్ విషయంలో ఒక న్యాయం, కర్నాటక, మహారాష్ట్ర విషయంలో మరో న్యాయమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జూరాలలో కొంత నీరున్నప్పటికీ శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు అడుగంటి పోయాయన్నారు. అల్మట్టి, తుంగభద్ర తదితర ఎగువ ప్రాజెక్టుల్లో వస్తున్న నీటిని వాడుకుంటూ కిందికి వదలకుండా నీటినిల్వను నిలకడగా పెట్టుకుంటున్నారన్న విషయం కృష్ణా నదీజలాల బోర్డు గమనంలోకి తీసుకోవాలన్నారు. అడుగంటిన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు దామాషా ప్రకారం నీరు విడుదల చేయాలన్నారు.
తెలంగాణలో కెసిఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వర్షాలు లేవని, పంటలు లేవని, వ్యవసాయ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని, రైతుల ఆత్మహత్యలు ఎక్కువ కాగా ఆయనకు వ్యవసాయంలో నంబర్‌ఒన్‌గా పేర్కొంటు కేంద్ర వ్యవసాయ మండలి అవార్డును ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన ఫాంహౌస్‌లో ఏదైనా ఘనకార్యం చేసి ఉంటే అవార్డు ఇచ్చినా బాగుండేదన్నారు.
మద్దతు ధర కావాలన్న రైతులకు ఖమ్మం జిల్లాలో బేడీలు వేసినందుకు అవార్డా, రాష్ట్రంలో వ్యవసాయాన్ని భ్రష్టుపట్టించిన కెసిఆర్‌కు అవార్డు ఇవ్వడం రైతాంగాన్ని అవమాన పర్చడమేనన్నారు. వ్యవసాయ మండలి రాష్ట్రంలో పర్యటించి వ్యవసాయ పరిస్థితులను తెలుసుకుని అవార్డు ఇస్తే బాగుండేదన్నారు. సమావేశంలో సిపిఎం నాయకులు డాక్టర్ గౌతంరెడ్డి, పి.శశిధర్‌రెడ్డి, మహ్మద్‌బిన్‌సయిద్, ఆర్.పరశురాములు, కె.శంకర్, సత్యనారాయణలున్నారు.