Others

గ్రాఫిష్మతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చరిత్ర పుటల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని సృష్టించుకొని.. ఉద్వేగభరితాక్షరాలతో రాసిన తన జీవిత గాథని ప్రజల హృదయ పొరల్లో నిక్షిప్తం చేసుకున్న పోరాట వీరుడిగా తెరపై చిరంజీవిని చూపబోతున్న అంతర్జాతీయ భారీ (సెట్టింగ్స్ కాదు) గ్రాఫిక్స్ సినిమాకి అడుగడుగునా విస్మయపరిచే ఆలోచనలు కావాలి! రెమ్యూనరేషన్ కూడా హైరేంజ్‌లో.. చిరంజీవి లెవెల్లో వుంటుంది. రండి మంచి మంచి వెరైటీ థాట్స్‌తో మమ్మల్ని సంప్రదించండి’’ అంటూ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ, బహుముఖ చిత్రాల భారీ తెలుగు నిర్మాత నుంచి ఓ విచిత్ర సినిమా ప్రకటన వెలువడింది.
కట్ చేస్తే..
‘‘రొమాంటిక్ పర్సనాలిటీతో కలకాలం కుర్రకారుని ప్రేమ డోలికల్లో ఉర్రూతలూగిస్తున్న.. ఓ క్రేజీ నావెల్ పర్సన్ పూర్తిస్థాయి లవ్‌స్టోరిని అక్కినేని నాగార్జునతో నభూతో నభవిష్యతిలా ప్లాన్ చేస్తున్నాం. మాంచి గ్రాఫిక్స్ ఫుటేజ్ ఉన్న థీమ్స్ కావాలి. అవి విజువల్ వండర్స్‌కి పెద్దపీట వేసేలా ఉండాలి! పారితోషకం ఊహించని రీతిలో ఉంటుంది’’ అంటూ సినీ రంగం నోరెళ్లబెట్టేలా తన ట్విట్టర్ సాక్షిగా సినీ ప్రపంచానికి టాపిక్ చేరవేసాడు సదరు ఫేమస్ డైరెక్టర్.
సీన్ మారిస్తే-
‘‘నందమూరి నటసింహం బాలకృష్ణతో కమిటయ్యాం.. పవర్‌ఫుల్ పౌరాణిక తెలుగు సినిమాకి కథనాన్ని హైలెట్ చేసే విజువల్స్ వండాలి. అది సినిమానా.. మాయాజాలపు సమ్మోహనమా.. అనేట్టుగా జనం తన్మయత్వంతో పిచ్చెక్కిపోవాలి. ఉర్రూతలూగించే గ్రాఫిక్స్ సీన్స్ మీరందిస్తే.. మిమ్మల్ని షాకింగ్‌కి గురిచేసే అవౌంట్ మీకు మేమందిస్తాం.. బి రెడీ!’’ ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బడా రచయిత అనౌన్స్ చేసిన ఈ మ్యాటర్ సర్వత్రా చర్చనీయాంశమైంది.
బ్రేకప్ చేస్తే-
‘‘చిలిపి హాస్యం టచ్ చేస్తూ.. కుటుంబ బాంధవ్యాల భావోద్వేగాలను తెరనిండా పరుచుకునేలా దగ్గుబాటి వెంకటేష్‌తో... ఓ ఫ్యామిలీ పిక్చర్ రూపుదిద్దుకోబోతోంది. ఆ భావోద్వేగాలన్నీ సరికొత్తగా గ్రాఫిక్స్‌తో మిళితం చేసి ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేయాలని జాగ్రత్తపడుతున్నాం. గుండె తడికి గ్రాఫిక్స్ తోడైతే.. ఆ కానె్సప్ట్ కొత్తగా, వినూత్నంగా ఉంటుందన్నది ఆలోచన. అందుకు సరిపడా విజువల్ సరుకు ఇవ్వగలరా? మీ ఊహకి సరిపడా క్యాష్ తూకంవేసి మేమందిస్తాం’’ అంటూ ఊరిస్తూ ఓ న్యూస్ స్ప్రెడ్ అయింది భారీ చిత్ర నిర్మాణ సంస్థ నుండి.
ప్యాకప్ చెబితే-
ఈపాటికే సగం అర్థమై ఉంటుంది. ఇప్పటికిది ఊహాత్మకమే అయినా భవిష్యత్‌లో కాబోయే నిజాలు ఇవే కావొచ్చు. రేపటి రోజున ఇలాంటిలాంటి చిత్ర విచిత్ర విడ్డూర సినీ ప్రకటనలెన్నో చూడాల్సి ఉండొచ్చు. ఇప్పటికే వేళ్లూనుకుంటున్న గ్రాఫిక్స్ కాలాన్ని ఎవరు మాత్రం కాదనగలరు?
సరే! టెల్గూ సినిమా రూపురేఖలు ఎప్పుడో మారిపోయాయనుకోండి. ‘కత’ అతీ గతీ లేకుండా వాచిపోయింది. ‘కథనం’ వెగటు హాస్యంతో కళ్లెంలేని గుర్రంలా పరిగెత్తుతోంది. అర్థం పర్థంలేని సన్నివేశాలతో తెలుగు సినిమా కలగాపులగమైపోయింది. సినిమా నిడివి సైతం హీరోయన్లు చేస్తున్న ఐటెం సాంగ్‌లోని క్రేజీ కాస్ట్యూమ్ అంత పొట్టిదైపోయింది. ఇక సినిమా విడుదలకి ముందు హైపేమో హీరో స్టారు రెమ్యూనరేషన్ రేంజ్‌లో వెలిగిపోతుంది. తప్పదు కదా వీకెండ్ జాలీగా గడిపేయడానికి.. టికెట్టు పెట్టి సినిమా చూస్తే, తల బొప్పి కట్టిపోతోంది. అయినా వాళ్ళకి తప్పడం లేదు. వల విసరాలి.. ప్రేక్షకులను థియేటర్లలో కుమ్మేయాలి. అందుకు ఎత్తని ‘కుమ్ముడు’ పథకమంటూ ఉండదు. అవి పైన చెప్పుకున్నట్టే ఉండకూడదని రూలేమీ లేదు.
క్లైమాక్స్‌కు వస్తే..
ఇనుముని అయస్కాంతంలా మార్చినట్టు, జనాన్ని ‘మాయాస్కాంతం’ చేయడానికి తెలుగు సినిమా ‘విజువల్ పుంతలు’ తొక్కుతోంది. గ్రాఫిక్స్ గ్రాఫ్ హంగులని తలపాగాగా చుట్టేస్తోంది. ‘జై.. తెలుగు సినిమా గ్రాఫిష్మతి’!!
సినిమాని సరికొత్త కథలో కాదు, ఊహించని సన్నివేశాల కథ వైపు ప్యాకేజీతో కాదు, మెలోడ్రామా అయినా, యాక్షన్ పార్టయినా, పరిమళపు పాటయినా.. పరుగు తీసే నయగారా జలపాతపు హాస్యమైనా.. గ్రాఫిక్స్ మసాలా మిక్స్ చేసి ప్రేక్షకుడి కనువిందుకి వడ్డించాల్సిందే! అహో.. తెలుగు సినిమా!!
ఎవరి చేతుల్లో ఇపుడేమీ లేదు. సినిమా పరిశ్రమ ఇప్పుడెటు పోతోందో ఎవ్వరికీ తెలియడంలేదు. అసలేం జరుగుతుందో ఇసుమంతైనా అంతుపట్టడంలేదు. అంతా ఫాస్ట్ ఫార్వర్డ్‌లా జరిగిపోతోంది. ఒక అద్భుతంతో.. ఒక వండర్ క్రియేటివిటతో విస్మయ వాతావరణ సన్నివేశాలకి రూపకల్పన జరిగితే.. అదిపుడు తెలుగు సినిమా అవుతోంది -మంత్రాల బలం లేకపోయినా, తుంపర్ల బలం ఉండాలన్న విధంగా! మానవతా విలువలు కాదు.. సినిమాకి మాయాజాలపు వలువలు కావాలి. అనుబంధ బాంధవ్యాలు కాదు.. విజువల్స్ చందనాలు అద్దాలి. శుభం కార్డుకి ఓ నీతిని తగిలించడం కాదు.. గ్రాఫిక్స్‌తో కవర్ చేయాలి! జయ జయ జయహో.. అప్పటి విఠాలాచార్య సినిమాలు పునఃఆవామి!!

-ఎనుగంటి వేణుగోపాల్