మహబూబ్‌నగర్

ఫిర్యాదులు పరిష్కరించేందుకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల: గ్రీవేన్స్ డేలో వచ్చిన దరఖాస్తులకు సంబంధించి ఆయా శాఖ అధికారులు సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవేన్స్ డే సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ఇప్పటివరకు వివిధ శాఖలకు వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పెండింగ్‌లో ఉన్న వాటి గురించి నివేదిక అడిగి తెలుసుకున్నారు. ధరఖాస్తులను కింది స్థాయి ఉద్యోగికి పంపించి తన పని ఐపోయిందని చూపడం సరైంది కాదని బాధితుడి సమస్య పరిష్కారం లభించినప్పుడే గ్రీవేన్స్ ఫలితం ఉందన్నారు. ప్రభుత్వ నిబందనలో ఏవైనా సమస్యలున్నాయా... ఆర్థిక పరమైనా సమస్యలు తెలుసుకుని చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రోజు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 56 మంది దరఖాస్తులు అందినట్లు తెలిపారు.