ప్రకాశం

నేటి నుండి ఆరు రోజులకోసారి తాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: ఒంగోలు నగర ప్రజలకు నేటి నుండి 6 రోజులకొకసారి తాగునీరు సరఫరా చేయనున్నట్లు ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ తెలిపారు. సోమవారం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ప్రస్తుతం ఒంగోలులోని మొదటి, రెండు సమ్మర్ స్టోరేజి ట్యాంకుల్లో నిల్వ ఉన్న తాగునీరు 6 రోజులకు ఒకసారి సరఫరా చేస్తే సెప్టెంబరు 15వ తేదీ వరకు వస్తాయన్నారు. ఈ లోగా సాగర్ నీరు ఒంగోలుకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఒక వేళ సాగర్ నీరు రాని పక్షంలో ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని పేర్నమిట్ట వద్దగల చెరువునుండి ట్యాంకర్ల ద్వారా నగర ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తామన్నారు. వాతావరణం అనుకూలింకపోవడంతో వర్షాలు తగిన మేర కురవక పోవడంతో సాగర్‌లో తాగునీరు నిల్వ లేకపోవడంతో ఒంగోలుకు త్రాగునీరు విడుదల చేయలేదని కమిషనర్ తెలిపారు. వర్షాలు కురవకపోవడంతో ఒంగోలు నగరంలోని మొదటి, రెండు సమ్మర్ స్టోరేజి ట్యాంకులకు కూడా నీరు చేరలేదన్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా నగర పరిధిలోని పేర్నమిట్టలో గల చెరువు తోపాటు, నగరంలోని అన్ని బావులు, బోర్లను మరమత్తులు చేయించడం జరిగిందన్నారు. మరమత్తులు చేయించిన పేర్నమిట్టలోని చెరువు నుండి తాగునీరు ట్యాంకర్ల ద్వారా నగర ప్రజలకు సరఫరా చేయడం తోపాటు బావులు , బోర్ల నుండి నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటి అవసరాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఈ లోగా సాగర్ నీరు విడుదల అయితే నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజు మార్చి రోజు తిరిగి త్రాగునీరు సరఫరా చేస్తామన్నారు. ప్రస్తుతం నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాల్సిందిగా కమిషనర్ వెంకటకృష్ణ కోరారు. ఇదిలా ఉండగా ఈనెల 25న జరగనున్న వినాయక చవితి పండగకు నగర ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ పారీస్‌తో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజకు వాడకుండా పొల్యూషన్‌ను దృష్టిలో పెట్టుకోని పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టితో తాయారు చేసిన వినాయక విగ్రహాలను కొనుగోలు చేసి ప్రజలు పూజించాలని కమీషనర్ కోరారు. నెల్లూరు పొల్యూషన్ కంట్రోల్ సంస్థ వారు 5 అడుగల ఎత్తుకలిగిన మట్టి వినాయక విగ్రహాలను కూడా తాయారు చేసి అమ్ముతున్నారు. కనుక బాగా ఖరీద్ అయిన ఎతైన విహ్రాలను కొనుగోలు చేసి ఉత్సాహంగా వినాయక ఉత్సవాలను జరపాలను కున్న వారు 5 అడుగుల ఎత్తుగల వినాయక విహ్రాలను కొనుగోలు చేసి జరపాలని కోరారు. అదే విదంగా కొన్ని ప్రవేటు సంస్థలు 10 నుండి 20 రూపాయల కే అతి తక్కువ ధరకు మట్టి వినాయక విగ్రహాలను తాయారు చేసి అమ్ముతున్నారని , మరికొన్ని ప్రవేటు స్వచ్ఛంద సేవా సంస్థలు ఉచితంగా నే మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేయనున్నారని, కనుక మట్టి వినాయక విగ్రహాలను తీసుకెళ్లి వినాయక ఉత్సవాలను బాగా జరుపుకోవానలి కమీషనర్ తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఒంగోలు కార్పొరేషన్‌కు 6 ఎన్‌టి ఆర్ అన్న క్యాంటీలను మంజూరు చేయటం జరిగిందని తెలిపారు. ఈ క్యాంటీలను పెట్టేందుకు ఇప్పటికే నగరంలో 5 ప్రాంతాలను గుర్తించడం జరిగిందని తెలిపారు. వీటి గాను ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ లోని రైతు బజారు లో ఒక క్యాంటీన్ ను ఏర్పాటు చేయనుండగా, బాపూజి మార్కెట్ వద్ద ఒకటి, కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఒకటి, ప్లై ఓవర్ బ్రిడ్జి క్రింద ఒకటి, రిమ్స్ హస్పటల్ వద్ద మరొక క్యాంటీను ను ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. మరొక క్యాంటీను ఏర్పాటు కు సంబంధించి ప్రాంతాన్ని గుర్తించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం గుర్తించిన పై 5 ప్రాంతాలలో సెప్టెంబర్ మొదటి వారంలో క్యాంటీలను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు కమీషనర్ తెలిపారు. ఉదయం టిఫిన్, మధ్యహ్నం భోజనం, రాత్రికి పుల్కాలు పెట్టాలని ఆలోచిస్తున్నాం అని ఏదైనా 5 రూపాయల కే 400 గ్రాములు తగ్గకుండా పెట్టాలని ఉన్నట్లు కమీషనర్ తెలిపారు. ఈ అవకాశాన్ని కూడా ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ విలేఖర్ల సమవేశంలో ఒంగోలు కార్పోరేషన్ యంఇ సుందరరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.