ప్రకాశం

నేడు బ్యాంకుల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్: తొమ్మిది యూనియన్ల ఐక్య వేదిక యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్ల ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేది మంగళవారం జిల్లా వ్యాప్తంగా బ్యాంకుల సమ్మె చేపడుతున్నట్లు యుయఫ్‌బియు కన్వీనర్ వి పార్థసారధి తెలిపారు. దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లాలో మంగళవారం చేపట్టే సమ్మె లో బ్యాంకు ఉద్యోగులు, అధికారులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా సోమవారం భోజన విరామ సమయంలో స్టేట్ బ్యాంకు ఇండియా మెయిన్ బ్రాంచ్ వద్ద ఉద్యోగులు, అధికారులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరి వలన ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకుల పట్ల అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక , బ్యాంకు రంగ వ్యతిరేక చర్యలను వారు ఖండించారు. బ్యాంకింగ్ రంగం ఆర్థిక సంస్కరణను పూర్తిగా నిలిపి వేసి యూనియన్ల తో చర్చలు జరిపి తమ న్యాయమైన డిమాండ్ల ను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు దశల వారీగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకరంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా సమ్మె కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటారన్నారు. వచ్చే నెల లేదా నవంబర్‌లో రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునిస్తామన్నారు. తప్పని సరిగ్గా వచ్చే నెల 15వ తేదిన ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద దాదాపు లక్ష మంది బ్యాంకు ఉద్యోగులతో పార్లమెంట్ చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జిల్లాలో బ్యాంకుల వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా స్థంభించి పోతాయని దీంతో ప్రజలకు, ఖాతాదారులకు ఇబ్బందులు వస్తాయన్నారు. తాము చేపడుతున్న సమ్మె తమ జీతాల కోసం కాదని , ప్రజా ప్రయోజనాలను, బ్యాంకు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వాటిని కాపాడటం కోసం, ప్రభుత్వ రంగ బ్యాంకులను రక్షించుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. తాము చేస్తున్న సమ్మెకు ఖాతాదారులతో పాటు జిల్లా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ల నాయకులు యు వేణుగోపాల్, పికె రాజేశ్వరరావు, వి వేణుగోపాల్, వి రామచంద్రరావు, సిహెచ్ శోభాన్‌బాబు, విజయ మోహన్, నరేంద్రబాబు, ఉమాదేవి, క్రిష్ణారెడ్డి, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.