గుంటూరు

ఉప రాష్టప్రతి సత్కార వేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 22: భారత ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు కు ఈనెల 26వ తేదీన ఏర్పాటుచేసే పౌరసన్మాన కార్యక్రమానికి సచివాలయ సమీపంలో వేదిక ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదేశించారు. మంత్రి కామినేని కలెక్టర్ కోన శశిధర్, సిఆర్‌డిఎ కమిషనర్ సిహెచ్ శ్రీధర్‌లతో కలిసి మంగళవారం వేదిక స్థల పరిశీలన చేశారు. సభకు సుమారు ఐదువేల మంది హాజరవుతారని కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో సిఆర్‌డిఎ ల్యాండ్స్ డైరెక్టర్ చెన్నకేశవరావు తదితరులు పాల్గొన్నారు.

బోర్లపై త్వరలో టాస్క్ఫోర్స్ తనిఖీలు

గుంటూరు, ఆగస్టు 22: జిల్లాలో నిరుపయోగంగా ఉన్న బోరుబావులను తక్షణమే పూడ్చివేయాలని రూరల్ ఎస్పీ సిహెచ్ వెంకటప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు. జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభం, శుభం తెలియని చిన్నారుల పాలిట బోరుబావులు మృత్యుకుహ రాలుగా మారుతున్నాయని, గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు యంత్రాంగం ఇకపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వారం రోజుల్లో టాస్క్ఫోర్స్ తనిఖీలు నిర్వహించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. రైతులు స్వచ్ఛందంగా సమాజ సేవలో భాగంగా స్పందించి నిరుపయోగంగా ఉన్న బావులను పూడ్చివేయాలని కోరారు.

రిటైర్డ్ ఇంజినీర్‌పై కత్తితో దాడి
మంగళగిరి, ఆగస్టు 22: పట్టణంలోని ఆర్‌టిసి బస్టాండ్ సమీపంలో మంగళవారం రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజినీర్ వణుకూరి నాగిరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడిచేసి గాయపరిచాడు. పోలీసుల కధనం ప్రకారం సీతానగరం పిడబ్ల్యుడి వర్క్‌షాపులో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వణుకూరి నాగిరెడ్డి విజయవాడలో నివాసం ఉంటున్నాడు. మంగళగిరి కోర్టుకు వచ్చి తిరిగి వెళ్తుండగా బస్టాండ్ సమీపంలో నాగిరెడ్డి మెడపై గుర్తు తెలియని వ్యక్తితో నరికి పరారయ్యాడు. గాయపడ్డ నాగిరెడ్డిని చికిత్స కోసం హుటాహుటిన చినకాకానిలోని ఎన్నారై ఆస్పతికి తరలించారు. నాగిరెడ్డి కోలుకుంటున్నాడు. ఈ ఘటనకు ఆర్ధిక లావాదేవీలే కారణంగా ప్రాధమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.

వృత్తి నైపుణ్యం ముఖ్యం

*వైద్యులకు కేంద్రమంత్రి నడ్డా వినతి

గుంటూరు (పట్నంబజారు), ఆగస్టు 22: ప్రపంచంలో వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వైద్యులు తమ వృత్తిలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా పేర్కొన్నారు. మంగళవారం గుంటూరు రూరల్ మండలంలోని కేర్ డెంటల్ కళాశాల ఆడిటోరియంకు శంకుస్థాపన, డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం లైబ్రరి ప్రారంభోత్సవ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభకు కళాశాల సెక్రటరి అండ్ కరస్పాండెంట్ డాక్టర్ సయ్యద్ రసూల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జెపి నడ్డా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య రంగానికి అత్యధిక నిధులు కేటాయిస్తున్నాయన్నారు. ప్రైవేటురంగంలో కూడా మరిన్ని కళాశాలలు ఏర్పాటు కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రొఫెసర్‌లు వైద్య విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ సయ్యద్ రసూల్ మాట్లాడుతూ విద్యార్థులకు వౌళిక వసతులు కల్పించడంలో అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. అనుభవం గల ప్రొఫెసర్‌లచే కళాశాలలో విద్యాబోధన చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు రావెల కిషోర్‌బాబు, విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ వైద్యరంగంలో అనుభవమున్న రసూల్ ఈ కళాశాలను ఏర్పాటుచేసి భావి డాక్టర్లను రూపొందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి ఎంఎస్‌ఐడిసి చైర్మన్ ఆర్ లక్ష్మీపతి, కళాశాల డైరెక్టర్ సమీనాబేగం, విజయభాస్కరరెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్‌కిషోర్, బిజెపి మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ గౌస్ మొహిద్దిన్, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి లాల్‌వజీర్, డాక్టర్ శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ సుబ్బానాయుడు తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ పనులను పూర్తిచేయాలి

*అధికారులకు ఆర్టీసీ ఆర్‌ఎం ఆదేశం

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 22: గుంటూరు రీజియన్ డిపోల పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఆడిట్ పేరాలను తక్షణమే పరిష్కరించాలని ఎకౌంట్స్ డిపార్ట్‌మెంట్ అధికారులకు ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి సూచించారు. ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్‌లోని తిక్కన సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని డిపోల పర్సనల్ డిపార్ట్‌మెంట్ సూపర్‌వైజర్లతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థకు రావాల్సిన బకాయిల వసూళ్లను చేయు పనుల్లో నిబద్దత కలిగి ఉండాలని, డిపోల్లో ఆర్థికపరమైన అంశాలపై ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు తెలియజేస్తూ, పెండింగ్‌లో ఉండకుండా చూసుకోవాలన్నారు. పర్సనల్ డిపార్ట్‌మెంట్ సూపర్‌వైజర్‌లు ఆఫీసు పనికే అంకితం కాకుండా ట్రాఫిక్ వ్యవస్థపై దృష్టి సారించాలన్నారు. వనిత, ఫ్యామిలీ కార్డులను ప్రాముఖ్యత పక్షోత్సవాలు జరుగుతున్నాయని, ఎడి, పిడి, సూపర్‌వైజర్లు తమ వంతు బాధ్యతగా పట్టణ, గ్రామీణ ప్రాంత వాసులకు కార్డుల ప్రాముఖ్యత తెలియపరుస్తూ విక్రయించాలన్నారు. సమావేశంలో సిటిఎం సిహెచ్ వెంకటేశ్వరరావు, ఎఎంపి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం దేశవ్యాప్తంగా 65 వేల మంది ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ విద్యార్థులు నాసా విద్యార్థి వ్యవస్థగా ఏర్పడి సమాజంలో అంధులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా వారిని ఆదుకునేందుకు బ్రెయిలి లిపిని నేర్చుకుని, వారికి తెలిసే విధంగా బ్రెయిలి బోర్డులను ఏర్పాటుచేసి అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్‌లో అందులకు సులువుగా అర్ధమయ్యే విధంగా ప్లాట్‌ఫారానికి వెళ్లేందుకు బ్రెయిలి లిపిలో బోర్డులు ఏర్పాటుచేసినందుకు విద్యార్థులను ఆర్‌ఎం అభినందించారు.

ప్రశాంతమైన వాతావరణాన్ని
కలుషితం చేస్తున్న జగన్

* ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్

గుంటూరు, ఆగస్టు 22: రాజకీయాల్లో విలువలు సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ ప్రశాంతమైన నంద్యాల వాతావరణాన్ని చెడగొడుతూ రాజకీయ విలువలను దిగజార్చే విధంగా జగన్ ప్రవర్తిస్తున్నారని టిడిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. మంగళవారం గుంటూరులోని తెలుగుదేశం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో విలేఖర్లతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని, ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఇది జీర్ణించుకోలేని జగన్ ఏదో విధంగా ప్రభుత్వంపై బుదరజల్లే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన భాష, వ్యవహారశైలి సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని, ఈ వ్యవహారశైలిని నంద్యాల ప్రజలు గమనిస్తున్నారని, ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా వైసిపికి బుద్ధిచెప్తారని స్పష్టంచేశారు. కేవలం ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంతో ఉన్న జగన్‌కు రాష్ట్భ్రావృద్ధి కన్పించక పోవడం బాధాకరమన్నారు. వైసిపి మహిళానేత రోజా వ్యాఖ్యలు అత్యంత జుగుత్సాకరంగా ఉన్నాయని, ఇటువంటి మహిళా నేతలను తానెప్పుడూ చూడలేదన్నారు. దేశ చరిత్రలోనే రైతులకు 24 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తెలుగుదేశానికే దక్కుతుందన్నారు.

మిర్చిలో మచ్చుతీస్తే కఠిన చర్యలు

* వ్యాపారులతో యార్డు చైర్మన్ మన్నవ

గుంటూరు, ఆగస్టు 22: మిర్చి యార్డులో కమిషన్ అధికంగా వసూలు చేసినా.. మచ్చుకాయలు తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు హెచ్చరించారు. మంగళవారం ఈ విషయమై కమిషన్ ఏజెంట్లు, కార్మిక సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. రైతులు ఆరుగాలం పండించిన పంటను యార్డుకు తీసుకు వస్తుంటే కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కర్షకుల శ్రమను దోచుకుంటే సహించేదిలేదన్నారు. మచ్చుకాయల విషయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. వారం రోజుల్లో తూనికలు-కొలతల శాఖ యార్డులో తనిఖీలు నిర్వహిస్తుందని తెలిపారు. కమిషన్ ఏజంట్ల అసోసియేషన్ ప్రతినిధి సాంబిరెడ్డి మాట్లాడుతూ కమిషన్, మచ్చుకాయల విషయంలో గతంలో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవమేనని, ఇకపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. కార్మికనేత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కమీషన్ విషయంలో నిబంధనల ప్రకారం వసూలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో యార్డు కార్యదర్శి దివాకర్ తదితరులు పాల్గొన్నారు.

జీవో 493 తక్షణం అమలు చేయాలి

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 22: యూకలిప్టస్, సుబాబుల్ మార్కెటింగ్‌లో పోటీ పెంచడానికి పెద్ద వ్యాపారులను అనుమతిస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 493ను తక్షణమే అమలులోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ గుంటూరు, ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శులు వడ్డే హనుమారెడ్డి, ముసునూరి రమేష్‌బాబు డిమాండ్ చేశారు. గుంటూరులోని మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో మార్కెటింగ్ కమిషనర్ శామ్యూల్ ఆనంద్‌ను మంగళవారం కలిసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూకలిప్టస్ జామాయిల్ కొనుగోలు చేసే పేపర్ మిల్లులు వ్యాపారుల నుంచి ముందుగా బ్యాంకు గ్యారెంటీలు తీసుకోవాలన్నారు. బ్యాంకు గ్యారెంటీకి మించి కొనుగోలు చేసి బకాయిలు పెట్టే మిల్లుల నుంచి వసూలు చేసి రైతులకు ఇప్పించే బాధ్యత మార్కెటింగ్ శాఖదేనన్నారు. ప్రకాశం జిల్లాలో పేపర్ మిల్లులను నెలకొల్పాలన్నారు. ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండూరి రంగారావు మాట్లాడుతూ రైతు ప్రయోజనాలకు గొడ్డలి పెట్టువంటి జీవోనెంబర్ 143లో 4వ పాయింట్‌లోని జె క్లాజ్‌ను తొలగించాలన్నారు. కార్యక్రమంలో ఆచార్య రంగా కిసాన్ సంస్థ ప్రధాన కార్యదర్శి చంచు శేషయ్య, వైసిపి రైతు వేదిక జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి, ఎపి రైతు సంఘం ప్రకాశం, గుంటూరు జిల్లా నాయకులు ఎన్ అంజిరెడ్డి, విఠల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.