బిజినెస్

ఇన్ఫోసిస్ బోర్డులోకి నిలేకని?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ బోర్డులోకి సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నిలేకని తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన రావాలని సంస్థాగత మదుపరులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. దేశీయ రెండో అతిపెద్ద ఐటి రంగ సంస్థ అయిన ఇన్ఫోసిస్.. సంక్షోభంలో కూరుకుపోయినది తెలిసిందే. సంస్థ వ్యవస్థాపకులు, బోర్డు సభ్యుల మధ్య బేదాభిప్రాయాలు తలెత్తగా, గత వారం సిఇఒ విశాల్ సిక్కా రాజీనామా కూడా చేశారు. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ మాజీ సిఎఫ్‌ఒ వి బాలకృష్ణన్‌తోపాటు ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, రిలయన్స్ ఫండ్స్ తదితర 12 సంస్థాగత మదుపరులు నిలేకనిని బోర్డులోకి తీసుకోవాలని గట్టిగా కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిలేకని ఇన్ఫోసిస్ చైర్మన్‌గా వస్తే బాగుంటుందని బాలకృష్ణన్ అభిప్రాయపడుతున్నారు. ఆయనకున్న అనుభవం, క్లయింట్లతో ఉన్న పరిచయాల దృష్ట్యా ఇన్ఫోసిస్‌కు లాభం చేకూరుతుందని పిటిఐతో మాట్లాడుతూ అన్నారు. మరోవైపు సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్‌ఆర్ నారాయణ మూర్తి.. మదుపరుల సమావేశాన్ని వాయిదా వేశారు. బుధవారమే ఇది జరగాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల రిత్యా ఈ నెల 29కి వాయిదా పడింది. ఇకపోతే ఇన్ఫోసిస్ సంక్షోభం దురదృష్టకరమని కర్నాటక పరిశ్రమల శాఖ మంత్రి ఆర్‌వి దేశ్‌పాండే విచారం వ్యక్తం చేశారు. బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఇన్ఫోసిస్ ఐటి సేవలను అందిస్తున్నది తెలిసిందే.