ఆంధ్రప్రదేశ్‌

‘ఉపాధి’ నిధులు మళ్లిస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు వినియోగిస్తే సహించేది లేదని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ స్పష్టం చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్, పంచాయతీ రాజ్ - గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, అటవీ పర్యావరణం, రవాణా, ఆర్ అండ్ బి మైన్స్ అండ్ జియాలజీ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, వైద్య ఆరోగ్యం, ప్రణాళిక శాఖలపై బుధవారం వెలగపూడి సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఉపాధిహామీ నిధులను మళ్లించవద్దని, ఇప్పటికే ఏమైనా అడ్వాన్సులు ఇచ్చి ఉంటే వెంటనే ఆ మొత్తాన్ని వెనక్కు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బెల్టుషాపులను నిర్మూలిస్తున్నట్టుగానే ఇక ఇసుక మాఫియాను పూర్తిగా అదుపు చేసేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సిఎస్ ఆదేశించారు. గుర్తించిన ప్రతి ఇసుక రీచ్‌కు ఒక డిజిగ్నేటెడ్ అధికారిని నియమించి ఇసుక అక్రమంగా తరలిపోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ గురించి ఆయన మాట్లాడుతూ ప్రజలే ముందు కార్యక్రమంలో భాగంగా బెల్టుషాపుల నిర్మూలన, ఇసుక మాఫియా వంటి ఇతర అంశాలపై 1100 కాల్ సెంటర్, కనెక్టు టు ఎపి సిఎం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వంటి వాటి ద్వారా వచ్చే ఫిర్యాదులపై సకాలంలో స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వనం-మనం కార్యక్రమంపై సిఎస్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం కింద ఈ ఏడాది 24 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం కాగా ఇప్పటికే 6 కోట్ల మొక్కలు నాటామని, ఇంకా 19 కోట్ల మొక్కలు నాటాల్సి ఉందన్నారు. మలేరియా, డెంగ్యూ, ఇతర అంటు వ్యాధులు ప్రబలకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు ఆయా వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 15 నాటికి ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.