Others

అంతా మంచికే.. (శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేదు అనుభవాలను తీపి జ్ఞాపకాలుగా ఎలా మలుచుకోవచ్చో జానీలీవర్ జీవితాన్ని చదువుకుంటే అర్థమవుతుంది. కళలపట్ల ఆకర్షితుడైన జానీలీవర్ పదహారణాల తెలుగువాడు. -బాల్యంలో మిత్రుల వద్ద మిమిక్రీ చేస్తూ వినోదపరుస్తూ ఆనందించేవాడు. తరువాత తెలుగు సినిమా పరిశ్రమలో నటుడిగా కొనసాగాలన్న ధ్యాసతో ప్రయత్నాలు చేశాడు. అయితే, అతని ప్రయత్నాలు కార్యరూపం దాల్చలేకపోయాయి. చాలామందిలా -ఆ రోజున జానీలీవర్ నిరుత్సాహపడివుంటే, ఆయన గురించి ప్రపంచం మాట్లాడుకుని ఉండేది కాదు. అవకాశం రాలేదని నిరుత్సాహపడకుండా బొంబాయి వెళ్లిపోయి, తెలుగువాళ్లు నివాసం ఉండే ప్రాంతాల్లో మిమిక్రీ ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాడు. తనకు తెలిసిన మిమిక్రీ విద్యతోనే హిందీ చిత్రరంగాన్ని ఆకర్షించగలిగాడు. ‘తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఎదురైన నిరాదరణ నాకు చేదు అనుభవంతో కూడిన తీపి జ్ఞాపకం’ అని అందుకే అంటాడు జానీలీవర్. అందరితో తలలో నాలుకలా కలిసిపోతూ జాతీయస్థాయిలో హిందీ నటుడిగా కీర్తినార్జించాడు. సినిమాల్లో నటులుగా ఎదగాలని ప్రయత్నాలు విఫలమై, అక్కడే ఆగిపోయేవాళ్లకు జానీలీవర్ ఓ పెద్ద స్పిరిట్. జంధ్యాల స్మారక అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌కు వచ్చిన జానీలీవర్‌తో చిరకాల మిత్రుడు, నటుడు అశోక్‌కుమార్ తీసుకున్న అరుదైన చిత్రమిది.

-పర్చా శరత్‌కుమార్ 9849601717