మెయిన్ ఫీచర్

అన్యోన్యానికి అర్థం మారుతుందా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లంటే మూడు ముళ్లు.. ఏడడుగులు కాదు.కలిమిలోనూ లేమిలోనూ కలకాలం తోడుంటామని బాస చేసుకునే పవిత్ర బంధం. కళ్యాణం అనే ఈ పదంలోనే ఎంతో కమ్మదనం దాగివుంది. వివాహం అయిన తరువాత సంఘంలో పరిపూర్ణమైన జీవితానికి పునాది ఏర్పడుతుంది. కాని ఈ అనురాగ బంధం నేడు అపహాస్యం పాలవుతుంది. పెళ్లయిన వెంటనే వేరే కాపురానికి రెడీ అవ్వటం. ఆధునిక జీవనశైలికి అలవాటుపడలేక యువతీ యువకులు విడాకులకు మొగ్గు చూపుతున్నారు. విడాకులు తీసుకోవటమనేది హక్కుగా మారిపోయింది. దేశంలో విడిగా జీవించే జంటలు రాను రాను అధికమవుతున్నాయి. పెద్దలు కుదిర్చిన పెళ్లయినా.. ప్రేమ పెళ్లయినా పదికాలాల పాటు పచ్చగా ఉండటం లేదు. వెయ్యి పెళ్లిళ్లు జరిగితే అందులో ఒక జంట విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నదని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. విడాకులు పట్టణవాసులకు ఫ్యాషన్‌గా మారిపోయిందనుకుంటే పొరపాటే. గ్రామీణ ప్రాంతాలలోనూ విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. వీరు విద్యావంతులు కాకపోయినప్పటికీ చిన్నపాటి పొరపచ్చకే విడిగా జీవించటానికే ఇష్టపడుతున్నారు.
ఆమె అభిప్రాయానికి విలువెక్కడ?
పెళ్లి చేస్తున్నామంటే అటు ఏడుతరాలు, ఇటు ఏడుతరాలను చూసి పెళ్ల చేస్తారు. కాని వధువు అభిప్రాయాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోవటం లేదు. ముచ్చటైన జంటగా పదికాలలపాటు సంసారం చేయాలంటే ఇరువురి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. సంప్రదాయం పేరుతో ఆమె అభిప్రాయానికి విలువ నివ్వటం లేదు. పట్టణ ప్రాంతాలలో పరిస్థితి కాస్తంత మెరుగ్గా అనిపించినప్పటికీ ఇప్పటికీ 40శాతం మంది యువతులు తమ అభిప్రాయాలను చెప్పలేకపోతున్నారట. తల్లిదండ్రులు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వారిని పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లయిన తరువాత అత్తారింటికి వచ్చిన కోడలు ఆరోగ్యం బాగుండక వైద్యుని వద్దకు వెళ్లాలన్నా.. అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇలాంటి చిన్న చిన్న విషయాలకే వివరణ ఇచ్చుకోలేక చాలా జంటలు గొడవలు పడి విడిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. మహిళలకు ఆస్తి హక్కు లభించటం, విడాకులు తీసుకోవటం సులభతరం చేయటంతో చాలామంది చదువుకున్న అమ్మాయిలు పవిత్రమైన వివాహ బంధాన్ని ఆర్థిక బంధంగా భావిస్తూ విడాకులకు మొగ్గు చూపుతున్నారు. ఉన్నత మధ్యతరగతి, ధనిక కుటుంబాల్లో అయితే ఈ బంధాలు ఆస్తుల తగాదాల వరకు వెళ్లి ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆర్థిక స్వాతంత్య్రం కారణమా?
ఇంట్లో తమ వ్యక్తిత్వాన్ని కించపరిచే చిన్నపాటి సంఘటన జరిగినా.. సర్దుబాటు, సహనంతో వ్యవహరించకుండా.. చదువుకున్న అమ్మాయిలు విడాకులు తీసేసుకుంటున్నారు. ఉమ్మడి కుటుంబాల స్థానంలో చిన్న కుటుంబాలు రావటంతో భార్యభర్తలు ఇద్దరూ ఒకరికి ఒకరు తోడుగా సహజీవన భావనను పదిలంగా కాపాడుకుంటూ, సర్దుబాటు వైఖరి అనుసరించాలి. కాని వారిద్దరి అభిరుచులు, ప్రాధాన్యతలు, ఆలోచనా విధానాలు వేరువేరుగా ఉండటం వల్ల సర్దుకోలేక ఘర్షణలు పడుతున్నారు. చివరకు ఆ జంట ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.
పిల్లలను వెన్నాడుతున్న ఒంటరితనం
నేటి జనరేషన్‌లో ఇగోకి అవకాశం ఇస్తున్నారు. అదే సమయంలో నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవి కొరవడి కొన్ని జంటలు ప్రేమ స్థానంలో పరస్పర ద్వేషానికి, అనుమానం, అవిశ్వాసానికి లోనవుతూ వారి కుటుంబాల్లో ప్రశాంతత లేకుండా చేసుకుంటున్నాయ. ఒక్కొక్కసారి ఇవి హింసాత్మక సంఘటనలకు దారితీస్తాయి. అలాగే కొందరికి తెల్లారేపాటికి ధనవంతులైపోయి.. విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే ఆలోచన కూడా బంధాన్ని తెంపేస్తుంది. ఇలాంటి మానసికి ప్రవృత్తి అక్రమ సంబంధాలకు దారితీసి హత్యలకు సైతం వెనుకాడని పరిస్థితులకు దారితీస్తుంది. దీనివల్ల ఆత్మీయానుబంధాలు ఏహ్యంగా మారిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఎక్కువ నష్టపోయేది పిల్లలే. వారి జీవితాలను చిదిమేస్తున్నాయి. తల్లిదండ్రుల మధ్య విభేదాల వల్ల మానసికంగా కుంగిపోయే పిల్లల కేసులు రెండు నెలలకు ఒకటి మాత్రమే తన వద్దకు కౌనె్సలింగ్ కోసం వచ్చేదని, కాని ఇపుడు ప్రతి వారం ఒక కేసు వస్తుందని ఢిల్లీకి చెందిన పిల్లల మానసిక వైద్య నిపుణురాలు నాపూర్ వెల్లడిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ వేగంగా పెనవేసుకుంటున్న ప్రేమ, పెళ్లి, సహజీవనం లాంటి బంధాలు బలీయంగా, దృఢంగా మారకుండానే అంతే వేగంగా అదృశ్యమవ్వటానికి నమ్మకం, విశ్వాసం లేకపోవటమే ప్రధాన కారణం. ఏ జంటైనా విడిపోవాలనుకుంటే తమ పిల్లలకు భద్రత, భరోసా కల్పించిన తరువాతే ఆ ఆలోచన చేస్తే మంచిది.
మన దేశంలో ఏటా 1.36 మిలియన్ల మంది విడాకులు తీసుకుంటున్నారు. అంటే పెళ్లి చేసుకున్నవారిలో దాదాపు 0.24శాతం, మొత్తం జనాభాలో 0.11శాతం ఉంది.
విడిగా ఉండటానికి మహిళలే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
ఈశాన్య రాష్ట్రాలలో విడాకులు తీసుకునేవారి సంఖ్య అధికంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇందులో మిజోరం మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ విడాకుల రేటు 4.08శాతం ఉంది. రెండో స్థానంలో నాగాలాండ్ ఉంది.
ఇక కులాంతర వివాహాలు దేశంలో 5శాతం మాత్రమే జరుగుతున్నాయి. దాదాపు 95శాతం వివాహాలు ఒకే కులస్థుల మధ్య జరుగుతున్నాయి. మిజోరంలో విడాకుల రేటుతో పాటు కులాంతర వివాహాలు సైతం ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ జరిగే వివాహాలలో 87శాతం కులాంతర వివాహాలే.
పది మిలియన్ల జనాభాకన్నా అధికంగా ఉండే అస్సాం, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్ తరువాత గుజరాత్‌లో గరిష్ట సంఖ్యలో విడాకులు తీసుకునేవారి సంఖ్య ఉంది.
ఉత్తర భారతదేశంలో బీహార్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ట్రాలలో విడాకుల రేటు తక్కువగా ఉంది.
అంతర్జాతీయంగా 71 దేశాలలో విడాకులు తీసుకునేవారిపై అధ్యయనం చేయగా జార్జియాలో 0.46శాతం మంది విడాకులు పొందుతున్నారు.

- ఆశాలత