సబ్ ఫీచర్

ఆరోగ్య వారధి బత్తాయిరసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతటివారైనా సుఖజీవనానికి ఆరోగ్య సూత్రాల్ని పాటించాల్సిందే. వేసవి వేడికి తట్టుకోవాలంటే చల్లని పానీయాలు తాగాల్సిందే.
బత్తాయి రసంలో ఫ్లవనాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి పొట్టకు మేలు చేస్తూ మేలు చేసే ఆమ్లాలువిడుదల చేయడంవలన జీర్ణాశయం శుభ్రపడి ఆరోగ్యాన్ని అందిస్తుంది. తద్వారా రోగాలు దూరవౌతాయి. ప్రతిరోజూ గ్లాసు బత్తాయిరసం తీసుకోవడంవల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.
మధుమేహం
నేడు మధుమేహం వ్యాధితో బాధపడేవారు ఇంటికొక్కరున్నారనటం అతిశయోక్తి కాదు. ఇది మధుమేహంతో బాధపడేవారికి మేలు చేసే పండు. దీంతో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. చెంచా బత్తాయి రసంలో కొద్దిగా నిమ్మరసం తగినంత తేనె కలిపి ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది.
వ్యర్థపదార్థాలు కూడా బత్తాయిరసం త్రాగడంద్వారా శరీరంలోని వ్యర్థపదార్థాలు దూరమవుతాయి. ఈ రసంలో వ్యర్థాలను దూరం చేసే ఆమ్లాలు ఉండటంవలన మలబద్ధకం దూరమైపోతుంది. అందుకే బత్తాయిరసం తీసుకునేటప్పుడు అందులో చిటికెడు పంచదార కలుపుకుంటారు.
రోగనిరోధక శక్తికి
బత్తాయిని ప్రతిరోజూ కొనడం అలవాటు చేసుకోండి. మీ గుండెలోని రక్తాన్ని సక్రమంగా సరఫరా అయ్యేట్లు చేస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్ల బాధలూ వుండవు. ఈ బత్తాయిని గర్భిణీలు తీసుకుంటే గర్భస్త శిశువు ఆరోగ్యంగా పెరుగుతాడు.
బరువు తగ్గడానికి
స్థూలకాయులు ఈ బత్తాయిని తింటే బరువు తగ్గుతారు. ఈ పండులో కెలొరీలు తక్కువ. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ బత్తాయి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితం కన్పిస్తుంది.
ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం, తత్ఫలితంగా బరువు తగ్గడానికి అవి ఉపయోగపడతాయి.
కీళ్లనొప్పులు మటుమాయం
బత్తాయిలో విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. ఇది కణజాలం దెబ్బతినకుండా కాపాడుతూ ఎముకల్ని దృఢంగా ఉంచటంవల్ల కీళ్లనొప్పులు క్రమక్రమంగా తగ్గుతాయి. ఫోలిక్‌యాసిడ్ కూడా ఈ పండులో అధికం. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
వేసవిలో ప్రతి ఇంట్లో బత్తాయి చాలా అవసరం. ఆరోగ్యాన్ని అందించి మనిషిని హాయిగాంచేది బత్తాయే.

-ఈవేమన