సంపాదకీయం

‘గిల్లడం’ మానని చైనా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాల్‌దీవులలో మూడు చైనా యుద్ధనౌకలు తిష్ఠ వేసి ఉండడం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ మూడవ తేదీనుంచి జరుపనున్న చైనా పర్యటనకు విచిత్రమైన నేపథ్యం. ఐదవ తేదీ వరకు చైనాలో పర్యటించే మోదీ నాలుగవ తేదీన చైనా అధ్యక్షుడు ఝీజింగ్ పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ చర్చలలో మాల్‌దీవులలో చైనా యుద్ధనౌకల ఉనికి గురించి ప్రస్తావన జరుగదు. ఎందుకంటే మాల్‌దీవులకు, చైనాకు మధ్య ‘ఇది ద్వైపాక్షిక వ్యవహారమని’ చైనా ప్రభుత్వం తేల్చివేయవచ్చు! కానీ మన ప్రధాని ఇలా తేల్చివేయడం సాధ్యం కాదు. ఎందుకంటే మాల్‌దీవులలో చైనా నౌకాదళాల ఉనికి మన దక్షిణ సరిహద్దుల భద్రతకు విఘాతకరమైన వికృత పరిణామం! మాల్‌దీవులను తమ సైనిక స్థావరంగా మార్చుకునేందుకు తాము ప్రయత్నించడం లేదని చైనా ప్రభుత్వం పదే పదే ప్రకటించింది. కానీ చైనా మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదన్న వాస్తవం ఇప్పుడిలా ధ్రువపడింది. అందువల్ల చైనాకు అవసరం లేని చోట, అంటే చైనా భద్రతకు సంబంధం లేని చోట, మన భద్రతకు విఘాతకరమైన రీతిలో చైనా యుద్ధనౌకలు తిష్ఠ వేయడం గురించి మన ప్రభుత్వం చైనాకు బహిరంగంగా నిరసన తెలుపవలసి ఉంది! డోక్‌లా-డోక్‌లామ్-నుంచి దళాలను ఉపసంహరించుకొనడానికి చైనా అంగీకరించడం మన ప్రధాని చైనా పర్యటనకు మార్గాన్ని సుగమం చేసిన పరిణామం. ‘బ్రిక్స్’-బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా-ప్రభుత్వాల అధినేతల సమావేశంలో పాల్గొనడానికై చైనాలోని ఫుజియా రాష్ట్రంలోని ‘ఝియాయు’ నగరానికి వెడుతున్న మో దీ చైనా అధ్యక్షునితో ‘సు హృద్భావ’ వాతావరణం లో చర్చలు జరుపడానికి ‘డోక్‌లా సయోధ్య’ దోహ దం చేసిందన్నది జరుగుతున్న ప్రచారం. కానీ చైనాకు నిజానికి ‘సుహృద్భావం’ లేదన్నది ఇలా మళ్లీ ధ్రువపడింది. ‘డోక్ లా’లో వివాదం ముగియగానే మాల్‌దీవులలో చైనా యుద్ధనౌకల ఉనికి ఆవిష్కృతమైంది. ‘గిల్లడం’ చైనా ప్రభుత్వం మానడం లేదన్నది ధ్రువపడిన వాస్తవం! మాల్‌దీవుల దేశం మన లక్షద్వీపాలకు అత్యంత చేరువలో ఉంది. నిజానికి దక్షిణంగా ఉన్న మాల్‌దీవులు, ఉత్తరంగా ఉన్న మన లక్షద్వీపాలు ఒకే ‘దీవుల మాల’గా ఏర్పడి ఉండడం నైసర్గిక వాస్తవం. అంటే దక్షిణం నుండి ఉత్తరంగా విస్తరించి ఉన్న మాల్‌దీవులు ఒకప్పుడు మన దేశంలో భాగం, లక్షద్వీపాల వరకు కొనసాగింపు. మాల్‌దీవులు మన లక్షద్వీపాల వరుస నుండి, మన దేశం నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడడం బ్రిటన్ దురాక్రమణ ఫలితం. లక్షద్వీపాలకు, మాల్‌దీవులకు మధ్య నెలకొని ఉన్న అత్యంత ఇరుకైన సముద్ర ప్రాంతం అతి ప్రధానమైన, కీలకమైన జలమార్గం!
మన దేశానికి తూర్పున ఉన్న దేశాల నుంచి ఆఫ్రికా, పశ్చిమ ఆసియా, ఐరోపా, అమెరికా తూర్పు తీరపు దేశాలకు వెళ్లే ఓడలు ఈ జలమార్గం గుండా పయనిస్తున్నాయి! అందువల్ల మాల్‌దీవులలో మన శత్రుదేశాల ఓడల ఉనికి మనకు ప్రమాదకరం! ఈ కీలకమైన సముద్ర జలమార్గం మనదేశానికి అత్యంత చేరువలో ఆగ్నేయం నుండి నైరుతిగా విస్తరించి ఉంది. మన అండమాన్ దీవులకూ, ఇండోనేసియాకు మధ్యగల ఇరుకైన సముద్ర ప్రాంతంలో, హిందూ మహాసముద్రం బంగాళాఖాతం కలిసే చోట మొదలవుతున్న ఈ జలమార్గం శ్రీలంకను చుట్టి మన లక్షద్వీపాలకు దక్షిణంగా మాల్‌దీవులకు ఉత్తరంగా ఉన్న ఇరుకైన సముద్ర ప్రాంతం గుండా సాగుతోంది! అంటే బంగాళాఖాతాంతో అండమాన్ సముద్రంతో హిందూ మహాసముద్రం కలిసే చోట మొదలైన ఈ జలమార్గం మనదేశాన్ని దక్షిణంగా చుట్టి అరేబియా హిందూసాగర సంగమస్థలి వరకూ కొనసాగుతోంది. అక్కడి నుంచి హిందూ మహాసముద్రం మీదుగా ఆఫ్రికా ఖండానికి, అరేబియా ఎఱ్ఱ స ముద్రాల మీదుగా సూయజ్ కాలువ ద్వారా మధ్యధరా సముద్రానికి, ఐరోపాకు, అమెరికాకు ఓడలు పయనిస్తున్నాయి. మన సముద్ర భద్రతకు కీలకమైన ఈ ప్రాంతంలో చైనా ఓడలు పెద్దసంఖ్యలో ఇప్పటికే సైనిక కలాపాలను సాగిస్తున్నాయి! మాల్‌దీవులలో చైనా యుద్ధనౌకలు ప్రవేశించడం ఈ అక్రమసైనిక కలాపాలలో భాగం...
అరేబియా సముద్రం ఎఱ్ఱ సముద్రం కలిసే చోట ఏర్పడి ఉన్న ఇరుకైన జల మార్గం సమీపంలో ఆఫ్రికా ఈశాన్య భాగంలో జిబౌటీ దేశం నెలకొని ఉంది. జిబౌటీ మన కర్నాటక, మహారాష్ట్ర తీరాలకు పశ్చిమంగా, అరేబియా సముద్రానికి ఆవల నెలకొని వుంది. జిబౌటీ రాజధాని ‘జిబౌటీ’ నగరంలో తమ సైనిక స్థావరం ఏర్పాటు చేసినట్టు చైనా ప్రభుత్వం జూలై నెలలో ఆధికారికంగా ప్రకటించింది. ఇలా ఈ కీలక ‘జలమార్గం’లో చైనా సైనిక స్థావరం, నౌకాదళాలు, ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’ దళాలు నెలకొనడం చైనా సైనిక విస్తరణకు నిదర్శనం! ఇప్పుడు ఈ ‘జిబౌటీ’కి ఆగ్నేయంగా శ్రీలంకకు పశ్చిమంగా ఉన్న మాల్‌దీవులలో చైనా యుద్ధనౌకల విహారం మొదలైంది. ఇదివరకే శ్రీలంక ఓడరేవులలో చైనా యుద్ధనౌకలు, జలాంతర్గాములు తిష్ఠ వేయడం, మన ప్రభుత్వం నిరసనలు తె లుపడం వంటి ప్రహసనం జరిగిపోయింది! చైనా నౌకాదళాల ఉనికి విస్తరిస్తునే ఉంది. మాల్‌దీవులలో చైనా చేరిపోవడం వ్యూహాత్మక వైఫల్యానికి నిదర్శనం. ఎం దుకంటే 1990వ దశకం ఆరంభం వరకు మాల్‌దీవులు మ నకు అత్యంత సన్నిహిత మిత్రదేశం. కానీ పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స విభాగమైన ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్’ మాల్‌దీవులలో జిహాదీలను ప్రవేశపెట్టింది. ‘లష్కర్ ఏ తయ్యబా’ శిబిరాలలో శిక్షణ పొందిన మాల్‌దీవుల యువకులు జిహాదీలుగా మారి స్వదేశానికి తిరిగి వెడుతున్నారు. ఈ నేపథ్యంలో 2011 నవంబర్‌లో చైనా మాల్‌దీవుల రాజధాని మా లేలో దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటుచేసింది. చైనా దౌత్యం మాల్‌దీవులలోకి చొరబడడం చరిత్రలో అదే మొదటిసారి! చైనా దౌత్య కార్యాలయం ‘వెలసిన’ తరువాత, మన దేశానికి చెందిన ‘జిఎమ్‌ఆర్’ వాణిజ్య సంస్థను మాల్‌దీవుల ప్రభుత్వం తమ దేశం నుంచి వెళ్లగొట్టింది. మాలే విమానాశ్రయాన్ని ఆధునీకరించడానికి జిఎమ్‌ఆర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న మాల్‌దీవుల ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని మధ్యలో రద్దు చేసింది, ఈ ఆధునీకరణను చైనా సంస్థలకు అప్పగించడం మనదేశం పట్ల ‘అమిత్రవైఖరి’కి నిదర్శనం..
ఇప్పుడు మాలేలో చైనా యుద్ధనౌకలు తిష్ఠవేశాయి. మాలే, జిబౌటీ, పాకిస్తాన్‌లో గ్వాడార్.. మన దేశాన్ని పశ్చిమ తీరం పొడవునా దిగ్బంధించాలని చైనా వ్యూహంలో ఈ ‘విస్తరణ’ భాగం. మాల్‌దీవులు నిజానికి భారతదేశంలో భాగమైన మాలా ద్వీపాలు. క్రీస్తునకు పూర్వం పదమూడవ శతాబ్దిలో వౌర్య అశోకుడు పాలించిన నాటికి మాలాద్వీపాలు మన దేశంలో భాగం. క్రీస్తునకు పూర్వం ఐదవ శతాబ్దిలో విజయుడు అనే రా కుమారుడు మాలా ద్వీపాలను సందర్శించాడు. క్రీస్తుశకం ఎనిమిదవ శతాబ్దం నుండి జిహాదీలు, ఆ తరువాత ఐరోపా వారు మాల్‌దీవులలో చొరబడినారు. మాల్‌దీవులు మన దేశానికి దూరమైంది!