తెలంగాణ

న్యాయ చట్టాలపై సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశంలో మొదటిసారిగా ఇంటర్నేషనల్ లా పై అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్‌లోని నల్సార్ విశ్వవిద్యాలయం సెప్టెంబర్ 3వ తేదీ నుండి నిర్వహించనుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సుకు దేశ, విదేశాల నుండి ప్రసిద్ధి గాంచిన 60 మంది ఉన్నత స్థాయి న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరుకానున్నారు. పెద్ద ఎత్తున ప్రజల వలస, పెట్టుబడుల సమస్యలు, వివిధ ట్రిబ్యునల్స్ ముందున్న చట్టపరమైన ఇబ్బందులు తదితర అంశాలపై ఈ సదస్సులో విస్తృత స్థాయి చర్చలు జరుగుతాయి. ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులు సంస్థలకు అవసరమైన అంతర్జాతీయ న్యాయవ్యవస్థలను ఈ సదస్సులో వ్యక్తమైన అభిప్రాయాలకు అనుగుణంగా సంలీనం చేస్తారు. ప్రధానంగా ఐక్య రాజ్యసమితి చట్ట సంబంధ అంశాలకు కూడా ఈ సదస్సు దోహదం చేయనుంది. ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ జస్టిస్ నుండి ముగ్గురు న్యాయమూర్తులు, వరల్డ్ బ్యాంకు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నుండి ఇద్దరు న్యాయమూర్తులు, యుఎన్ యగొస్లోవియా ట్రిబ్యునల్ నుండి ఒకరు, ఇతర ప్రధాన ట్రిబ్యునల్స్ నుండి కూడా పెద్ద ఎత్తున న్యాయమూర్తులు హాజరుకానున్నారు. భారత ప్రభుత్వ న్యాయ సలహాదారు డాక్టర్ పి ఎస్ రావు, ఢిల్లీ యూనివర్శిటీ విసి ప్రొఫెసర్ యోగేష్ తాగి , సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ లీగల్ స్టడీస్ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ బి ఎస్ చిమ్ని , ఐసిజె మాజీ అధ్యక్షుడు. జస్టిస్ నాగేంద్ర సింగ్, ప్రొఫెసర్ వి ఎస్ మణి తదితరులు హాజరవుతారు.