తెలంగాణ

మంత్రులపై కేసు కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో నగరశివారులోని వౌలాలి వద్ద రైల్‌రోకో నిర్వహించిన కేసులో సికిందరాబాద్ రైల్వే కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, నాయిని నర్సింహారెడ్డి, టి పద్మారావు సహా 14 మందిపై నమోదైన కేసును రైల్వే కోర్టు కొట్టివేసింది. 2011లో రైల్‌రోకో నిర్వహించి, రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారన్న అభియోగంపై వీరిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రైళ్ల రాకపోకలను అడ్డుకోవడమే కాకుండా ఆస్తులు ధ్వంసం చేసేందుకు యత్నించిన నేరంపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఐదేళ్లుగా విచారణ కొనసాగింది. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం రైల్వే ఆస్థుల ధ్వంసంపై సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కోర్టు రాష్ట్ర మంత్రులు సహ 14మందిపై నమోదైన కేసును కొట్టివేస్తున్నట్టు తీర్పు ప్రకటించింది. ఈ కేసులో అనేక సార్లు రాష్ట్ర మంత్రులు కోర్టుకు హాజరైన విషయం తెలిసిందే.