తెలంగాణ

టిఆర్‌ఎస్ నేత ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు: తాండూరు కార్యకర్తల సమావేశంలో ఘోరం జరిగింది. అధికార టిఆర్‌ఎస్‌కు చెందిన మైనార్టీ నాయకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంత్రి సమక్షంలోనే పార్టీలో తనకు ప్రాతినిధ్యం లేదంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుధవారం చోటుచేసుకున్న సంఘటన వివరాల్లోకి వెళితే.. 2011 నుంచి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల కార్యకర్తగా పని చేసిన తాండూరు పట్టణ శాఖ మాజీ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ బుధవారం సాయంత్రం సమద్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన టిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నాడు. పార్టీలో తనకు న్యాయం జరగడం లేదని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాటాలు చేసిన ఉద్యమకారులకు విలువ లేదని, తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యాడు. ఈ సమావేశానికి వచ్చిన మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలోనే పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతణ్ని తోటి కార్యకర్తలు సమీప ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఈ హఠాత్పరిణామంతో మంత్రితోపాటు కార్యకర్తలు అవాక్కయ్యారు. సమాచారం అందుకున్న రూరల్ సిఐ సిబ్బందితో హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకున్నారు. సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీవ్రంగా గాయపడిన అయూబ్ ఖాన్ వెంట మంత్రి మహేందర్‌రెడ్డి, కార్యకర్తలు కూడా హైదరాబాద్‌కు తరలి వెళ్లారు. మెరుగైన చికిత్స అందించాలని మంత్రి వైద్యులను కోరారు. అయూబ్ ఖాన్ ఉదంతంతో పట్టణంలోని మైనార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మైనార్టీ నేత అయూబ్ ఖాన్ పార్టీలోని వ్యతిరేక వ్యవహారాలపై ఓపిక నశించి ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా రాజకీయ జెఏసి చైర్మన్ సోమశేఖర్, పలువురు విద్యావంతుల వేదిక ప్రతి నిధులు వాపోయారు. తాండూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.