సబ్ ఫీచర్

‘దయ’గల గోడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి పని మంచి మనసును ప్రతిఫలిస్తుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన డాక్టర్‌కు వచ్చిన ఓ వినూత్న ఆలోచన పలువురి పేదల కనీస అవసరాలను తీర్చేదిగా నిలిచింది. డాక్టర్ ఆలోచన పిచ్చిదనికొంతమంది కొట్టిపారేసినా సేవా సంకల్పంతో ఆచరణలో పెట్టిపలువురితో భేష్ అనిపించుకున్నారు. ఇప్పుడు ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రహరీగోడ ఇప్పుడు పదిమందిలో హాట్ టాపిక్ అంటే అతిశయోక్తి కాదు. ఈ గోడ పలువురికి ‘దయ’చూపుతోంది. దీంతో దయగల గోడగా ఆసుపత్రి డాక్టర్లు నామకరణం చేయడం విశేషం. సేవా దృక్పథం ఇందులో దాగి ఉందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ గోడ ఓ వేదికగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరైనా తమకు పనికి రాకుండా పోయిన వస్తు సామగ్రిని ఆ గోడ వద్ద వదలి వెళ్లొచ్చు. ఆ వస్తువులు ఎవరికైనా వినియోగపడవచ్చనే భావనకు వస్తే వారు స్వీకరించడానికి ఎలాంటి షరతులు లేకుండా ఉచితంగా పొందే వీలుంటుంది. పాత వస్తువును వదిలి వెళ్లినవారు అదే సందర్భంలో తమకు నచ్చిన వేరేదైనా వస్తువును అక్కడుంటే పొందవచ్చు కూడా. ఎలాంటి వస్తువును ఇవ్వకనే తమకు అవసరమైన సామగ్రి ఏమైనా అందుబాటులో ఉంటే తీసుకోవచ్చు. వస్తువులు అక్కడ పెట్టేవారు కనీసం వేరొకరికి ఉపయోగపడవచ్చనే దృక్పథంతోనే అందుబాటులో ఉంచాలి. స్వీకర్తలు సైతం ఊరకనే వస్తుందనే భావనతో కాకుండా అవసరమని భావిస్తేనే పొందాలి. రెండురోజుల క్రితం పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ చెన్నయ్య ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికిగాను స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్ డక్కా రమణమ్మ, మల్లికార్జున్ దంపతులు అవసరమైన ఏర్పాట్లతో గోడను నిర్మించడానికి సహకరించారు. ప్రారంభోత్సవ సందర్భంలోనే ఆసుపత్రి సిబ్బంది పలువురు తాము వినియోగించిన పాత దుస్తుల్ని ఆ గోడకు తగిలించారు. పాత పుస్తకాలను, పాదరక్షలు, ఇతర ఎలాంటి సామగ్రి అయినా వదిలి వెళ్లవచ్చు. అత్యవసరంగా ఆసుపత్రికి వచ్చిన రోగుల వెంట వచ్చిన కుటుంబ సభ్యులు రోజుల తరబడి ఉంటున్న సందర్భంలో తమకు దుస్తులు లేక ఇక్కట్లకు గురవుతుంటారు. అప్పటికప్పుడు రెడీమేడ్ వస్త్రాలు కొనుగోలు చేయాలంటే ఆయా పేద కుటుంబాలకు ఆర్థికంగా ఇబ్బందికరమే. ఇలాంటి నేపథ్యంలో తమకు తగిన సైజ్‌లో దుస్తులు ఉంటే స్వీకరించేందుకు ఎంతో వెసులుబాటుగా ఉంటుంది. ఆసుపత్రికి వచ్చే వారే కాకుండా ఆ దారిన పోయే ఇతరులు సైతం తమకు అవసరమైన వస్తువుల్ని పొందవచ్చు. ఇందుకోసమే ఆసుపత్రి వెలుపల భాగంలోనే ఈ ఏర్పాట్లు చేపట్టారు. ఇదిలాఉంటే ప్రస్తుతం ఈ గోడ వద్ద పైకప్పు ఏమీ లేకపోవడం వల్ల వర్షం వచ్చినప్పుడు అక్కడ అందుబాటులోకి తీసుకొస్తున్న దుస్తులు, వస్తువులు పాడైపోతున్నాయి. ఏదైనా పైకప్పును ఏర్పాటు చేయండని స్థానికులు సూచిస్తున్నారు.
చిత్రం.. దయగల గోడ ప్రారంభోత్సవంలో ఆసుపత్రి డాక్టర్లు, కమిషనర్, కౌన్సిలర్ డక్కా రమణమ్మ దంపతులు తదితరులు

- పువ్వాడ సుబ్బారావు