సబ్ ఫీచర్

అల్లం,తులసి,అలోవేరాతో ఆరోగ్యం.. ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక విజ్ఞానం అందరికీ అందుబాటులోకి వచ్చింది. అయినా ప్రతి ఇంట్లోను సుగర్, బిపి పేషంట్లు ఉంటున్నారు. 50, 60 ఏళ్లకి
మోకాళ్ల నొప్పులు, కీళ్ల బాధలు తప్పట్లేదు. వారు జబ్బుల
జాబితాను చూపిస్తుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేల ప్రకారం నేటికీ కూడా 70 శాతం చిన్నచిన్న రుగ్మతలకు ఇంట్లో పెంచుకునే మొక్కలే
ఔషధాలుగా పనిచేస్తాయని వెల్లడైంది. ఆ వివరాలు తెలుసుకుని అమలు
చేస్తే ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందవచ్చు.

కొబ్బరి..అరటి

ఇంట్లో తులసి, అలోవిరా, మెంతి, కొత్తిమీర, పుదీన, కరివేపాకు, గోతుకూల, ధిమ్, జర్మన్ చమోమిల్, నిమ్మకాయ గడి, నిమ్మకాయ బామ్, అల్లం, మందార, సన్నజాజి ఇతరత్రా మొక్కలు చాలావరకు ఇవన్నీ చిన్న చిన్న స్థలంలోనే చక్కగా పెరుగుతాయి. కుండీలో పెంచుకుంటే ఇంకా పెరడు అందంగా కనిపిస్తుంది. పెరడు వున్నవారు అక్కడక్కడ కొబ్బరి, అరటి చెట్లు పాదుకుంటే చాలా ఏళ్లు అవి మంచి ఫలాలను ఇస్తుంటాయి. అరటి చెట్టు ఒకసారి నాటినా అది గెలవేయగనే చుట్టురా మరిన్ని పిలకలు పెరిగి మరిన్ని చెట్లుగా వాటికవే పెరుగుతాయి. కొబ్బరి చెట్టు పాదు తీసి కాస్త ఉప్పు వేసి నీరుపోస్తే చాలు ఏ ఎరువులు లేకుండానే చక్కని కొబ్బరి బొండాలు, కాయలు ఇస్తుంది. కొబ్బరి మట్టలు, ఆకులు ఇంటిని చల్లగా వుంచుతాయి. ఎండను ఇంట్లోకి రాకుండా ఇవి అడ్డుకుంటాయి.
ప్రతిరోజు ధిమ్ అంటే హైదరాబాద్‌లో గంగబాయిల ఆకులు అంటారు. దీన్ని ఆహరంతోపాటు తీసుకుంటే కడుపు ఉబ్బరం అసలు ఏర్పడదు. బయట ఫాస్ట్ఫుడ్ లాంటివి తీసుకోవడంవల్ల తరచు వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. పాలకూర, మెంతికూర లాంటివి పప్పు దినుసులు లేకుండా వండుకుని తింటే అన్నిరకాల విటమిన్స్, ప్రోటీన్స్ శరీరానికి లభ్యమవుతాయి.

అల్లం
చూడడానికి పసుపుకొమ్ములా వుంటుంది. కేవలం ఇసుకలో కొద్ది అల్లాన్ని దాచినట్టుగా పెట్టినాసరే అల్లుకుంటు పోతుంది. అల్లంవల్ల వంటలో రుచినే కాదు పైత్యం లాంటి వాటికి విరుగుడుగా పనిచేస్తుంది. అల్లాన్ని టీలోకానీ, లేదా అల్లం రసంగాని తీసుకున్నట్టయితే చిన్నపిల్లల్లో ఏర్పడే నులిపురుగులను దూరం చేయవచ్చు. అల్లం వెల్లుల్లిని కలిపి కూరలో వాడడానికి పనికి వస్తుంది. అల్లం పచ్చడి కూడా చేసుకోవచ్చు. జలుబు చేసినపుడు అల్లం రసాన్ని తగు మోతాదులో తీసుకుంటే జలుబు మటుమాయం అవుతుంది. చిన్న కణుపు వున్న అల్లం ముక్కను మట్టిలో పాతితే ఒక వారంరోజుల్లోనే మళ్లీ అది పిలకవేస్తుంది.

తులసి
తులసి చెట్టులో మూడు రకాలున్నాయి. కృష్ణ తులసి, లక్ష్మితులసి, విష్ణు తులసి. ఏ రకం తులసి చెట్టు అయినా సర్వరోగ నివారిణిగానే వుంది. పూజలకు, ఔషధంగా కూడా తులసి ఆకులు ఉపయోడపడతాయి. తులసి ఆకులవల్ల తలనొప్పి, జలుబు లాంటివి దూరం అవుతాయి. పసిపిల్లలకు అంటే నెలలపిల్లలకు తులసి రసాన్ని ముక్కులో వేయడం లేదా ముక్కుకు రాయడం చేస్తే వారికి మంకుగా పట్టిన జలుబు కూడా దూరం అవుతుంది. తులసి పూసలు ధరించడంవల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మానసిక రోగాలను తులసి పూసలు దూరం చేస్తాయి. యాంటీ బయాటిక్‌గా తులసి పని చేస్తుంది. తులసి టీ, తులసి రసాన్ని సేవించిన వారికి శ్వాశకోస సంబంధ జబ్బులు దూరం అవుతాయి. దీని నూనె అన్నిరకాల వాపులను, నొప్పులను తగ్గించడంలో మేలైన మందుగా పనిచేస్తుంది కర్పూరం, తులసి నూనె రాసుకున్న వారికి తలనొప్పి, కాళ్లనొప్పులు లాంటివి రావు. దగ్గు తగ్గించడంలో తులసికి మించిన మందులేదు. రోజూ కొన్ని తులసి ఆకులను నమిలితే ఏ వ్యాధులు దరిచేరవు.

అలోవేరా
ఇది ఎడారిలో పెరిగే మొక్క. దీన్ని చక్కగా కుండీల్లో పెంచుకోవచ్చు. చర్మ వ్యాధులను దూరంచేస్తుంది. అలోవెరా ఆకుల్లో వుండే జిగురు పదార్ధం చర్మంపైన వచ్చే కురుపులకు, చిన్న చిన్నదద్దుర్లకు పూస్తే మళ్లీ రావు. కురుపుల వల్ల ఏర్పడిన మచ్చలు కూడా కరిగిపోతాయి. ఈ ఆకులో వుండే జిగురును వేడిచేసి దీనికి తేనె కలిపి తీసుకుంటే జీర్ణకోశ వ్యాధులు కూడా దూరం అవుతాయి. మలబద్ధక నివారిణిగా అలోవిరా రసం పనికివస్తుంది. అలోవిరాను రోజూ ముఖానికి, చేతులకు పూసుకుంటే ఎండ తీవ్రతవల్ల ఏర్పడిన నల్లని మచ్చలుపోయి చర్మం కాంతివంతం అవుతుంది. శరీరంలో ఎక్కడైనా తెగినపుడు గాని, దెబ్బ తగిలి వాచినపుడు కాని అలోవెరాను పూసినట్టయితే క్షణాల్లో వాపు తగ్గుతుంది.
కొత్తిమీర
కొత్తిమీర కాసిని ధనియాలతో ఏపుగా పెరగడమే కాదు చుట్టుపక్కల అంతా సువాసన వెదజల్లుతుంది. దీన్ని తీసుకోవడంవల్ల తల తిరగడం, కళ్లు తిరగడం లాంటి సమస్యలు దూరం అవుతాయి. శరీరానికి కావాల్సిన ప్రోటీన్ల తయారీలో కొత్తమీర పనికివస్తుంది. కడుపులో వికారం, నొప్పులు దూరం అవుతాయి. కంటికి సంబంధించిన వ్యాధులను నయం చేస్తుంది.
వెల్లుల్లి, నీరుల్లి
వెల్లుల్లిని తీసుకునేవారికి గుండె వ్యాధులు దరిచేరవు. స్ర్తిలలో వచ్చే రుతు సంబంధ వ్యాధులు, మైగ్రేన్ వంటి తలనొప్పులు కూడా దూరం అవుతాయి. రోజూ కాసిని వెల్లుల్లి రెబ్బలను తీసుకుంటే అసలు ఏ జబ్బులూ రావు. ఇలా ఎన్నో జబ్బులను దూరం చేసుకునే వీలు ఈ ఔషధ మొక్కల వల్ల కలుగుతోంది. నర్సరీల్లో కానీ లేదా ఇంట్లో కుండీల్లోగాని చిన్న స్థలంలో కానీ వీటిని పెంచుకుంటే అటు ఇంటికి అందమూ ఇటు ఆరోగ్యమూ కలుగుతుంది.

- జంగం శ్రీనివాసులు