Others

సితార (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1984లో వంశీనుంచి వచ్చిన సితార చిత్రం నాకు చాలా ఇష్టం. మహల్లో కోకిల అనే నవలను తీసుకుని పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని నిర్మించాడు. పంజరంలో పక్షిగా ఉన్న జమీందారీ కుటుంబానికి చెందిన యువతి ‘పేమ’ అనే స్వేచ్ఛను పొందిన కథ ఇది. అప్పట్లో ఈ చిత్రం పది థియేటర్లలో వంద రోజులు ఆడింది. చిత్రం ఏమంటే ఈ సినిమా స్టార్ హీరో లేడు. స్టార్ హీరోయిన్ లేదు. చెప్పుకోదగిన కాస్టింగ్ లేదు. భారీ సెట్టింగ్‌లు, విదేశీ షూటింగ్‌లు లాంటివేమీ లేవు. కళ్లముందు కథ జరిగిపోతున్నంత భావన కలిగిస్తాయి సన్నివేశాలు. నిజానికి తెర వెనుక హీరో వంశీ అయితే, తెరమీద హీరో భానుప్రియే. హీరోయిన్‌గా భానుప్రియకు రెండో సినిమా అయినా, నటనలో పరిణితి చూపించి ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. 1984లో ప్రకటించిన జాతీయ అవార్డుల్లో సితార మూడింటిని దక్కించుకుంది. ఉత్తమ గాయనికి ఎస్ జానకికి (వెనె్నల్లో గోదారి అందం), ఉత్తమ ఎడిటర్‌గా అనిల్ మల్నాడ్‌కు, ఉత్తమ ప్రాంతీయ చిత్రం క్యాటగిరీల్లో అవార్డులు అందాయి. అవార్డు దక్కించుకున్న వంశీమార్కు గోదారి పాటతోపాటు, కూకూకూ కోకిల గానం, జిలిబిలి పలుకుల, కినె్నరసాని వచ్చిందమ్మా, నీ గానం.. ఇలా పాటలన్నీ ఇప్పుడువిన్నా మరో లోకానికి లాక్కుపోవడం ఖాయం. ఇక దర్శకుడిగా వంశీకి బలమైన ముద్ర వేసింది ఈ చిత్రమే. ఆయన టేకింగ్, శైలి.. అన్నీ సితార చిత్రాన్ని క్లాసిక్ క్యాటగిరీకి చేర్చింది. సితార గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా అంతా తక్కువే అవుతుంది. చిత్రం గురించి మాట్లాడుకోవడ కంటే -చూసి ఆనందించాలి. తెలుగు చిత్ర సీమకు సితార ఓ గొప్ప క్లాసిక్. అందుకే ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం.

జివికె రాజు, మానేపల్లి