Others

రంగస్థలమే పునాదిగా.. (శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తొంకాయ్‌కూరో బావా కోరివండినానోయ్ బావా పాట గుర్తుండే ఉంటుంది. వంకాయ కూర కాసేపు పక్కన పెడితే నటుడు వంకాయల అటు రంగస్థల నటులకు ఇటు సినిమా రంగంలోని నటులకు ఎంతో ప్రీతిపాత్రుడు. హిందుస్థాన్ షిప్‌యార్డ్ (విశాఖపట్నం)లో పనిచేస్తూ నాటకరంగంలో తనదంటూ ప్రత్యేకత చూపుతూ వేలాది ప్రదర్శనల్లో పాల్గొన్నాడు. అఖిల భారత స్థాయిలో అలహాబాద్‌లో ప్రదర్శించబడిన ‘గరీబీ హటావో’ నాటకానికి రాష్టప్రతి అవార్డు పొందిన వంకాయల ‘నీడలేని ఆడది’ చిత్రం ద్వారా తెలుగు సినిమా రంగానికి పరిచయమయ్యాడు. తరువాత -అమ్మాయిలూ జాగ్రత్త, అత్తవారిల్లు, శివుడు శివుడు శివుడు, బహుదూరపు బాటసారి, టైగర్, ఎంతఘాటు ప్రేమయో లాంటి వందకు పైగా చిత్రాల్లో నటించాడు. ప్రారంభ దశలో ఉద్యోగానికి సెలవుపెట్టి మద్రాసువెళ్లి చిత్రంలో నటించి తిరిగి విశాఖకు చేరుకునే వంకాయల నటుడిగా బిజీ అయిన తరువాత ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి మద్రాసులో స్థిర నివాసం ఏర్పరుచుకుని బిజీ అయపోయాడు. తెలుగు సినిమా హైదరాబాద్ తరలి వచ్చినా తన మకాం మాత్రం హైదరాబాద్‌కు మార్చక మద్రాసునుంచి ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి షూటింగులలో పాల్గొనేవాడు. ప్రస్తుతం స్వస్థలం విశాఖకు చేరుకుని మళ్లీ నాటక రంగంలో బిజీగా జీవితం గడుపుతూ నటుడిగా, నిర్వాహకుడిగా సంతృప్తికరమైన జీవితం గడుపుతున్నాడు. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత తెలుగు చిత్రాలు ఇటు హైదరాబాద్‌లోను అటు విశాఖలోను రూపుదిద్దుకుంటున్నాయి. తన టాలెంట్‌నే నమ్ముకుని పలు తెలుగు చిత్రాల్లో గుర్తింపుగల సహాయ నటుడి పాత్రల్లో వెలుగొందిన వంకాయల నేడు వేషాలు సన్నగిల్లి అసహాయ నటుడుగా మిగిలిపోయాడు. నేడు వస్తున్న తెలుగు సినిమాల్లో తెలుగు భాషరాని (డబ్బింగ్ ఆధారంతో) పర భాషా సహాయ నటులను చూడలేక పెదవి విరుస్తున్న తెలుగు ప్రేక్షకులు ఆనందపడేలా విశాఖలో నిర్మాణం కాబోయే తెలుగు చిత్రాల్లో వంకాయల లాంటి సీనియర్ నటులకు తెలుగు సినిమా నిర్మాతలు అవకాశాలు ఇస్తారేమో చూద్దాం.

-పర్చా శరత్‌కుమార్ 9849601717