Others

ఎంతకాలం.. డబ్బా కబుర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాకు కొబ్బరికాయ కొట్టడం దగ్గరినుంచి గుమ్మడికాయ కొట్టేవరకు.. ఫస్ట్‌లుక్ విడుదల నుంచి టీజర్ కట్‌చేసే వరకు.. ఆడియో రిలీజ్ నుంచి సినిమా థియేటర్లకు వచ్చేవరకు.. ప్రతి సినిమాకూ ప్రకటించే పాస్‌వర్డ్ -బ్లాక్‌బస్టర్. కథమీద నమ్మకం ఒకరిది. కాంబినేషన్‌పై పిచ్చి నమ్మకం మరొకరిది. హీరో స్టామినా మీదో, దర్శకుడి స్టయల్‌మీదో నమ్మకం ఇంకొకరిది. ఇవేమీకాదంటే నిర్మాత పెట్టే బడ్జెట్‌మీద గట్టి నమ్మకం. అందుకే ప్రతి సినిమా ప్రారంభానికి ముందు వినిపించే మాట -ఇది కచ్చితంగా బ్లాక్‌బ్లస్టర్ అవుతుందని. ఇక్కడ వీళ్లదృష్టిలో బ్లాక్ బస్టర్ అంటే -సినిమా పదిరోజులు ఆడుతుందని. వీళ్లు చెబుతున్న మాటల్ని ఇప్పటి ఫలితాలు చూసి అలాగే అర్థం చేసుకోవాలి మరి.

తెలుగు చలన చిత్ర స్వర్ణయుగంలో చిత్రం యాభై రోజుల ప్రదర్శనకు నోచుకోపోతే అది ‘్ఫ్లప్’ చిత్రమని, నెల రోజులకే కనుమరుగయ్యే చిత్రాలను అట్టర్ ఫ్లాప్ చిత్రాలని, యాభై రోజులపైన వంద రోజుల లోపల ప్రదర్శన ఆగిపోతే ‘యావరేజ్’ చిత్రమనేవారు. చిత్రం శతదినోత్సవమంటే వంద రోజుల పిదప చేసే విజయోత్సవం జరిపితే, అలాంటి చిత్రాలు విజయం సాధించాయని తలంచేవారు. తరువాత సిల్వర్ జూబిలి (25 వారాలు), డైమండ్ జూబిలి (50 వారాలు), గోల్డెన్ జూబిలి (60 వారాలు), ప్లాటినమ్ జూబిలి (100 వారాలు) స్థాయికి వెళితే అఖండ విజయం సాధించిన చిత్రంగా భావించేవారు. సినిమా స్వర్ణయుగంలోనూ 20 శాతం ఫ్లాప్, 60 శాతం విజయం, 20 శాతం అఖండ విజయం సాధించిన చిత్రాలే కనిపిస్తాయ. అందుకే ఆ కాలాన్ని స్వర్ణయుగమని తలపోస్తున్నాం. మరి నేటి టాలీవుడ్ ఇప్పటి చిత్రాలను ‘బ్లాక్‌బస్టర్, సూపర్‌హిట్, సెనే్సషనల్‌హిట్, బంపర్ హిట్’- అని ఎలా నిర్ణయిస్తున్నాయో సామాన్య ప్రేక్షకులకు అంతుచిక్కడంలేదు. ఎక్కడా నెల రోజులు, యాభై రోజుల ప్రదర్శనకు నోచుకున్నట్లు నేటి చిత్రాలు కనిపించవు. మరి యాభై రోజుల ప్రదర్శన స్థాయి అటుంచి, కనీసం నెల రోజుల ప్రదర్శన స్థాయి కూడా లేని చిత్రాలను ‘బ్లాక్‌బస్టర్ మూవీ’ అని ఎలా అంటున్నారో భేతాళ ప్రశ్నగా మిగిలిపోతుంది? చిత్రం విడుదలకు ముందు అహో ఓహోలతో ఆరంభమై ఈ పాత్రకే హీరో హీరోయిన్లు జన్మించారు, వీరు తప్ప మరెవరూ ఈ పాత్రలు చేయలేరు, వారి బాడి లాంగ్వేజ్‌కు తగ్గట్టు దర్శకులు పాత్రలు మలిచారు, నాయిక నాయికలు పాత్రల్లో నటించలేదు, జీవించారంటూ కొడుతున్న డబ్బాల చప్పుళ్లు వినిపిస్తూనే ఉన్నాయ.
ఆడియో కార్యక్రమం హంగామాతో అదరగొడుతూనే వున్నారు. చిత్రం విడుదలైన పది రోజులకే కనీసం ఆడియో ఫంక్షన్ (అప్పు) ఖర్చు కూడా రాబట్టుకోలేక తుస్‌మంటున్నా మన టాలీవుడ్‌కు కనువిప్పు కలగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి ఇలాంటి స్థాయిగల చిత్రాలను బ్లాక్‌బస్టర్ చిత్రమని సంబోధించడం సబబేనా?. ఎలాగూ టాలీవుడ్‌లో చాలామంది పెట్టుడు బిరుదులతో చలామణీ అయపోతున్నారు. వంశం గొప్పతనం, తాత తండ్రుల గురించి గొప్పలు చెప్పుకోవడం ఎలాగూ మానరు. వినలేక చస్తున్నాం. వంశం పేరు చెబితే నాల్రోజులు ఎక్కువ ఆడి నాలుగు లక్షల ఆదాయం రావచ్చునేమో? తాత, తండ్రుల పేర్లు ఉచ్చరిస్తే మరో రెండు రోజులెక్కువ ఆడి మరో రెండు లక్షలు రావచ్చునేమో. అంతేగాని శతదినోత్సవం జరుపుకోవుగా. గత రెండేళ్ల చిత్రాల జాబితాను తీస్తే -చాలామంది సినీ ప్రముఖులు తందాన తాన కొట్టడమే కనిపిస్తుంది. పాపం అలాంటి చిత్రాలు కనీసం ప్రేక్షకుల ముఖం కూడా చూడకుండానే వెళ్లిపోతున్నాయ. ఫలానా చిత్రం బ్లాక్‌బస్టర్. ఫలానా స్టార్ హీరో కొడుకు.. ఫలానా బడా నిర్మాత కుమారుడు.. ఇంకో దర్శకుడి తమ్ముడు.. ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కో బ్లాక్ బస్టర్ చిత్రాన్ని పట్టకునే ఇండ్రస్టీకి వస్తున్నారు. ఎవరూ ప్రేక్షకులను రంజింపలేకపోతున్నారు. ఆమధ్య వచ్చిన ‘అఖిల్’ చిత్రానే్న తీసుకుందాం. వెండితెరను చీల్చి చెండాడుతాడని అఖిల్ (హీరో) చిత్రానికి అఖిల్ పేరే పెట్టారు. చిత్రం రజతోత్సవం చేసుకుంటుందని కలగని హీరో ప్రక్కన హీరో తండ్రితో పాటలో డ్యాన్స్‌లూ వేయంచారు. ‘అక్కినేని అక్కినేని’ అంటూ ఓ పాటపెట్టి అక్కినేని మర్యాదకు భంగం కలిగించారు. ఎలా చిత్రం తీస్తున్నాము, ప్రేక్షకులు ఆదరిస్తారా అని ఒకింత ఆలోచించరా?
టాలివుడ్ నేడు అవసాన దశలో వుంది. ఏడాదిలో నాలుగైదు చిత్రాలు చూడతగ్గవి తప్ప మిగతా బ్లాక్‌బస్టర్ చిత్రాలన్నీ దండుగే? అనే పరిస్థితే కనిపిస్తోంది. 2016 చిత్ర జయాప జయాలగురించి మాట్లాడుకుంటే -సోగ్గాడే చిన్నినాయన, జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో, ఊపిరి- ఇలా అతి కొద్ది చిత్రాలు విజయం సాధించాయ. అ ఆ, నేను శైలజ, హైపర్, ప్రేమమ్, జో అచ్యుతానంద, కల్యాణవైభోగమే, కృష్ణగాడి వీరప్రేమగాధ, మజ్ను, జెంటిల్‌మాన్, ఎక్స్‌ప్రెస్ రాజా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, క్షణం, జయమ్ము నిశ్చయమ్మురా, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, పెళ్లిచూపులు లాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. అవీ ఓకే అనిపించుకున్నాయ.
అయతే, వీటన్నింటినీ బ్లాక్‌బస్టర్ అనో, బంపర్ హిట్టనో ఎలా అనగలుగుతాం. చిత్రం విడుదల కాగానే థియేటర్‌లో 20 రోజులు కూడా ప్రదర్శింపబడకుండానే, మారుమూల థియేటర్లలో మరో నాలుగు రోజుల ప్రదర్శనకు చిత్రం షిప్ట్ చేస్తున్నారు. అలా షిఫ్ట్‌పై పాత టాకీసులకు వచ్చిన చిత్రాలన్నీ ఫ్లాప్ చిత్రాలేనని సామాన్య ప్రేక్షకుల అభిప్రాయం. అలాంటి చిత్రాలకు ప్రజలు ఆదరించారు, అఖండ విజయం సాధించాయి, హీరోకు మరో హిట్ పడిందని మసిపూసి మారేడుకాయ ఎన్నాళ్లు చేస్తారు. పట్టుమని నెల రోజుల ప్రదర్శనకు నోచుకోని చిత్రాలు హిట్టా? టాలీవుడ్ కళ్లకు గంతలు కట్టుకుంటుందా? కనీసం 50 రోజులు నడచిన చిత్రాన్ని మెచ్చుకుంటే ఓకె అనవచ్చు. చెత్త చిత్రాలను హిట్ అంటే ఎలా? కనీసం థియేటర్ మారకుండా నెల రోజులు నడిచే చిత్రాలేమైనా ఉంటున్నాయా? ప్రజలు నిజంగా ఆదరిస్తే ఆ చిత్రాలు యాభై రోజులు, వంద రోజులకు పరుగులు తీయాలిగా? ఫ్లాఫ్ చిత్రాలను హిట్‌గా చెప్పుకుంటూ భ్రమించటం టాలీవుడ్ తనను తాను మోసం చేసుకున్నట్టే. కాదంటారా?

-మురహరి ఆనందరావు