సంపాదకీయం

బర్మా మైత్రికి బలం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బర్మాలో పర్యటించడం ఇరుగు పొరుగు దేశాల మధ్య పెరుగుతున్న ఆత్మీయతకు నిదర్శనం. బుధవారం మన దేశానికి బర్మా-మ్యాన్‌మార్-కు మధ్య పదకొండు ఒప్పందాలు కుదరడం, బర్మా ప్రభుత్వ అధినేత్రి-స్టేట్ కౌన్సిలర్-అంగ్‌సాన్ సూచీతో మోదీ చర్చలు జరపడం వంటి పరిణామాలు ఈ పర్యటనలో భాగం. కానీ, భా రత ప్రధానమంత్రి బర్మాలో పర్యటించడమే వీటికంటే ప్రధానమైన పరిణామం. ఎందుకంటే బర్మా బ్రిటన్ దురాక్రమణ నుండి విముక్తమైన తరువాత ఏడు దశాబ్దాలుగా ఆ దేశంతో మన సంబంధాలు అంటీముట్టనట్టుగానే కొనసాగుతున్నాయి. గత మూడు నాలుగేళ్లుగా ఉభయ దేశాలు సన్నిహితం అవుతున్నప్పటికీ ఒకప్పుడు మన దేశంలో భాగంగా ఉండిన బర్మాతో మన స్నేహసంబంధాలు ఉండవలసిన స్థాయిలో లేవు. ఇరుగు పొరుగు దేశాలను పెద్దగా పట్టించుకోని మన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విధానం కారణంగా దశాబ్దుల తరబడి బర్మాతో మన సంబంధాలు అంతంత మాత్రమే అయ్యాయి! 1960వ దశకం నుంచి బర్మాలో మొదలైన సైనిక నియంతృత్వం ఆ దేశం మన దేశంతో అంటీముట్టనట్టు వ్యవహరించడానికి మరో కారణం. ఈ సైనిక ప్రభుత్వం చైనా కమ్యూనిస్టు నియంతల అదుపాజ్ఞలలో కొనసాగడం వల్ల బర్మా మన పొరుగు దేశమైనప్పటికీ దౌత్యపరంగా దూరంగా వుండిపోయింది. 1964 వరకు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉండిన నెహ్రూ చైనాతో మైత్రికి అధిక ప్రాధాన్యమివ్వడం చరిత్ర. అందువల్ల బర్మాలో చైనా అక్రమ ప్రమేయం గురించి , చైనా బర్మాలో సాగించిన వ్యూహాత్మక దురాక్రమణ గురించి నె హ్రూ పట్టించుకోలేదు! బర్మా దశాబ్దుల పాటు చె నా దౌత్య నియంత్రణకు బలైపోయింది. 2016లో మన దేశానికి వచ్చిన అప్పటి అమెరికా అధ్యక్షుడు బర్రాక్ హు స్సేన్ ఒబామా మన ప్రభు త్వం బర్మాలో జరుగుతున్న పరిణామాలను పట్టించుకోవడం లేదని విమర్శించి వెళ్లాడు. క్రీస్తుశకం 1950లో చైనా సైనిక దళాలు బర్మాలోకి చొరబడినాయి. 1950 మార్చి 17న మన పార్లమెంటులో ప్రసంగించిన జవహర్‌లాల్ నెహ్రూ, ‘ఏ రూపంలో అయినా ఇతర దేశాల వ్యవహారాలలో జోక్యం చేసుకొనడం మా అభిమతం కాదు, జోక్యం చేసుకునే హక్కు మాకు లేదు..’ అని ప్రకటించాడు. బర్మాలోకి చైనా చొరబాట్లను నిరసించడం బర్మా వ్యవహారాలలో అక్రమజోక్యం ఎలా కాగలదన్న ప్రశ్నకు సమాధానం దొరకలేదు. చైనా మద్దతుతో బర్మాలో జరుగుతుండిన కల్లోలాలను 1953లో మరోసారి లోక్‌సభలో నెహ్రూ ప్రస్తావించాడు! కానీ చైనాను నిరసించడానికి గాని, బర్మాకు మద్దతు నివ్వడానికి కాని అప్పటి మన ప్రభుత్వం పూనుకోలేదు. సుదీర్ఘ కాలంపాటు అనేకానేక విదేశాంగ వ్యవహారాలపై పార్లమెంటులో ప్రసంగించిన నెహ్రూ రెండుసార్లు మాత్రమే బర్మా గురించి మాట్లాడడం ఈ పొరుగు దేశం పట్ల మన అంటీముట్టని వైఖరికి నిదర్శనం...
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తరువాతనే బర్మాలో మన సంప్రదింపులు, సాన్నిహిత్యం పెరిగాయి. 2014 నవంబర్‌లో ప్రధాని హోదాలో మోదీ మొదటిసారి బర్మాకు వెళ్లి వచ్చాడు. అయితే అప్పుడు ఆసియా సదస్సులో పాల్గొనడం కోసం మోదీ బర్మాకు వెళ్లి వచ్చాడు. అప్పటికి అంగ్‌సాన్ సూచీ నాయకత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ అధికారం స్వీకరించలేదు. 2016లో అంగసాన్ సూచీ పార్టీకి చెందిన హితిన్ కుమావ్ బర్మా అధ్యక్షుడుగా ఎన్నికైన తరువాతనే మన దేశంతో బర్మా సంబంధాలు మరింత మెరుగయ్యాయి. 2015 జూన్‌లో మన సైనిక దళాలవారు బర్మాలోకి చొచ్చుకుని వెళ్లారు, ఉగ్రవాద శిబిరాలను బీభత్స స్థావరాలను ధ్వంసం చేసి వచ్చారు. చైనా మద్దతుతో దశాబ్దుల తరబడి మణిపూర్‌లోను, ఈశాన్య ప్రాంతంలో బీభత్సకాండ సాగించిన బీభత్స దళాలకు బర్మా స్థావరమైంది. మన సైనికులు వెళ్లి ధ్వంసం చేసినప్పుడు బర్మా ప్రభుత్వం నిరసించలేదు. చైనా మాత్రం భుజాలను తడుముకుంది. మణిపూర్‌లోను, ఈశాన్యంలోను హత్యకాండ సాగించిన బీభత్స మూకలతో తమకు సంబంధం లేదని చైనా నియంతలు ప్రకటించారు! తమ భూభాగాన్ని భారత వ్యతిరేక బీభత్స కలాపాలకు ఉపయోగించడానికి అనుమతించబోమని అంగ్‌సాన్ సూచీ బుధవారం మన ప్రధానికి హమీ ఇవ్వడానికి ఇదీ నేపథ్యం...
మోదీ, సూచీ చర్చల తరువాత ఉభయ దేశాల మధ్య పదకొండు ఒప్పందాలు కుదరడం బర్మాతో మనకు పెరిగిన సాన్నిహిత్యానికి నిదర్శనం. ఇలా బర్మా మనతో మైత్రిని పెంచుకోవడం చైనాకు ఇష్టం లేని పరిణామం! క్రీస్తుశకం 1962లో చైనా మద్దతుతో బర్మాలో సైనికుల తిరుగుబాటు జరిగింది! ఐదు దశాబ్దుల పాటు చైనా మద్దతుతో పాలించిన సైనిక కూటమి మన దేశాన్ని దాదాపు శత్రుదేశంగానే పరిగణించింది. ఎందుకంటే 1962 తరువాత చైనా మనకు శత్రుదేశమైంది! అంగ్‌సాన్ సూచీ నాయకత్వంలోని ప్రజాస్వామ్య ఉద్యమం కారణంగా ఈ సైనిక కూటమి ప్రభుత్వం చివరికి తొలగక తప్పలేదు. బర్మాలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడడం మన దేశానికి అనుకూలంగాను, చైనాకు వ్యతిరేకంగాగాను జరిగి న పరిణామం! బర్మా అధ్యక్షుడుగా ఎన్నికైన త రవాత యు.హితిన్ కు మావ్ మొదట సందర్శించిన విదేశం మన దేశం. గత ఏడాది ఫిబ్రవరిలో ఆయన మన దేశానికి వచ్చి వెళ్లడం కూడ చైనాకు నచ్చని పరిణామం. గతంలో అంగ్‌సన్ సూచీ మన దేశానికి వచ్చినప్పుడు కూడ చైనా పత్రికలు ఆమెపై నిప్పులు కక్కాయి! బర్మాలోని ప్రధాన భూభాగానికి సమీపంలోని నిర్జన ద్వీపాలలో తమ సైనిక స్థావరాలను నెలకొల్పడానికి గతంలో చైనా యత్నించింది. ఈ నిర్జన ద్వీపాలు మన అండ్‌మాన్ దీవులకు సమీపంలో ఉన్నాయి. అందువల్ల బర్మాలో చైనా సైనికుల స్థావరాలు ఏర్పడడం మన భద్రతకు ప్రమాదం! నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా బర్మాతో మనకు బుధవారం కుదిరిన సముద్ర రక్షణ అంగీకారం చైనా విస్తరణను, వ్యూహత్మక దురాక్రమణను నిరోధించడానికి దోహదం చేయగలదు...
బర్మా ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించడంలో మన దేశం సంపూర్ణ సహకారం అందించగలదని సూచీకి మోదీ బుధవారం హామీ ఇచ్చారు. రోహింగియా బీభత్సకారులు భారత-బంగ్లా-బర్మా సరిహద్దునకు సమీపంగా నెలకొని ఉన్న రఖానే అన్న బర్మా ప్రాంతంలో విద్రోహ కలాపాలను సాగిస్తుండడం దశాబ్దుల చరిత్ర! ఈ విద్రోహ కాండను నిరోధించడానికి మన దేశం సహకరిస్తుందని ఆమెకు మోదీ హామీ ఇచ్చాడు! అక్రమంగా మన దేశంలోకి చొరబడి ఉన్న రోహింగియా తెగ వారిని గుర్తించి తిరిగి బర్మాకు పంపిస్తామని మంగళవారం మన ప్రభుత్వం ఢిల్లీలో ప్రకటించడం సమాంతర శుభ పరిణామం! ప్రధాని మోదీ బర్మాలోని దేవాలయాలను సందర్శించడం ఉభయ దేశాల సమాన సాంస్కృతిక వారసత్వానికి కొత్త బలం. 1937వరకు బర్మా అఖండ భారత్‌లో భాగం..