బిజినెస్

తగ్గని కొరియా సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 6: అణుపరీక్షకు సంబంధించి అమెరికా, ఉత్తర కొరియాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం బుధవారం భారత స్టాక్ మార్కెట్లపై పడింది. అమ్మకం వత్తిడిని తట్టుకోలేక అనేక కీలక షేర్లు నష్టాలబారిన పడ్డాయి. గత వారంలో ఎన్నడూ లేని విధంగా సెనె్సక్స్ నష్టపోయింది. అలాగే అమెరికా డాలర్ మారకంతో పోలిస్తే భారత రూపాయి మూడువారాల కనిష్ఠానికి చేరుకుంది. మార్కెట్ పరిస్థితులను ప్రతిబింబిస్తూ 147.58 పాయింట్లను అంటే 0.48 శాతాన్ని కోల్పోయి సెనె్సక్స్ 31,661.97 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 36 పాయింట్లు కోల్పోయి 9,916.20 వద్ద ముగిసింది. మొదట భారీగానే మార్కెట్ నష్టపోయినప్పటికీ రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, కోటక్ బ్యాంక్ షేర్లు పుంజుకోవడంతో కొంతమేర నిలదొక్కుగోగలిగింది. యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ, ఎస్‌బిఐ షేర్లు 1.79 శాతం మేర పతనమయ్యాయి. లూపిన్, అదాని పోర్ట్స్, టాటా మోటార్స్ షేర్లూ నష్టపోయాయి. మారిన అంతర్జాతీయ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ విదేశీ పోర్ట్ఫులియో మదుపరులు తీవ్రస్థాయిలో అమ్మకాలు జరిపారు. అయితే దేశీయ సంస్థాగత ఇనె్వస్టర్లు దాదాపు 474.36 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసి ఈ అమ్మకాల ప్రభావాన్ని తగ్గించారు.