బిజినెస్

భారీగా పెరిగిన పత్తి సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ఎకాఎకిన 20 లక్షల హెక్టార్లలో రైతులు పత్తిపంట వేయడంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాలు, గ్రామాల వారీగా పత్తిపంట వేసిన రైతుల వివరాలు సేకరించాలని రాష్ట్రప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. వచ్చే అక్టోబర్ నుంచి పత్తిపంట ఉత్పత్తి మార్కెట్‌కు వస్తుంది. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం, కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచడం, సకాలంలో రైతులకు సొమ్మును చెల్లించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుసమగ్ర సర్వేలో భాగంగా సేకరించిన రైతుల వివరాలను జిల్లా కలెక్టర్లు విశే్లషిస్తున్నారు. సర్వే నంబర్, పత్తిపంట విస్తీర్ణం, బ్యాంకు అకౌంట్, ఆదార్ నంబర్ వివరాలను ఈ నెల 15వ తేదీ లోగా సమకూర్చాలని జిల్లా రెవెన్యూ, వ్యవసాయ యంత్రాంగాన్ని ప్రభుత్వం కోరింది. పత్తిరైతులకు బార్ కోడెడ్ గుర్తింపుకార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కౌలు రైతులకు కూడా బార్ కోడెడ్ గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు సమాచారం. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు న్యాయం చేసేందుకు, దళారుల ప్రమేయాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనుంది. క్వింటాల్ పత్తికి గిట్టుబాటు ధర రూ.4320 చొప్పున కేంద్రం నిర్ణయించింది. గత ఏడాది గిట్టుబాటు ధర క్వింటాల్ రూ.4160. మార్కెట్‌లో క్వింటాల్ రూ.. 4900 నుంచి రూ. 5100 కూడా పలుకుతోంది. కాటన్‌కార్పోరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రప్రభుత్వ సహకారంతో రైతులకు పూర్తి న్యాయం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖను ఇప్పటికే కోరింది. ఈ ఏడాది 20 నుంచి 20 లక్షల టన్నుల పత్తి బేళ్లు మార్కెట్‌లోకి రానున్నాయి. గత ఏడాది రాష్ట్రంలో 84 పత్తి కొనుగోలు కేంద్రాలు పని చేశాయి. ఈ ఏడాది అదనంగా 59 కొత్తగా పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం సిసిఐను కోరింది. మొత్తం 143 పత్తి కొనుగోలు కేంద్రాలు పనిచేస్తే రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అంచనా. వారంలోని అన్ని రోజులు కొనుగోలు కేంద్రాలు పనిచేసేటట్లు చర్యలు తీసుకోవాలని కూడా కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. స్ధానిక వ్యాపారుల వలలో పడకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ప్రతి శుక్రవారం జిల్లా కమిటీ కూడా మద్దతు ధరలపై సమీక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.