రాష్ట్రీయం

విశ్వనగరికి సొబగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రూ. 20,146 కోట్ల వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేశామని మున్సిపల్ మంత్రి కె తారకరామారావు పేర్కొన్నారు. నిధుల కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు మంత్రి వెల్లడించారు. ప్రణాళికల అమలును కొత్తగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ రోడ్ డవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో పాటు మూసీ డవలప్‌మెంట్ కార్పొరేషన్, జలమండలి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు (జిహెచ్‌ఎంసి) అప్పగిస్తామన్నారు. ఈ ప్రణాళికలో ప్రధానంగా రోడ్లు, మంచి నీటి సరఫరా, విద్యుద్దీపాలు, నాలాల విస్తరణ, మూసీ అభివృద్ధి, సుందరీకరణ తదితర అంశాలు ఉన్నాయన్నారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దాలన్న సిఎం కె చంద్రశేఖర్‌రావు కల సాకారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నగరంలో రోడ్ల అభివృద్ధికి రూ.6700 కోట్లు, మంచినీటి సరఫరా, మిషన్ భగీరథ కోసం రూ.2926 కోట్లు, మూసీ అభివృద్ధి, సుందరీకరణకు రూ.1665 కోట్లు, ఎల్‌ఇడి లైట్ల కోసం రూ.400 కోట్లు, నాలాల విస్తరణకు రూ.230 కోట్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం రూ.8225 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి పేర్కొన్నారు. ఇవేకాకుండా మరో రూ.7000 కోట్లతో నగరానికి శాశ్వత మంచినీటి సరఫరా కోసం రెండు రిజర్వాయర్లు నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. వీటిలో ఇప్పటికే రూ.10 వేల కోట్లతో పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. నగరంలో రూ.1500 కోట్ల వ్యయంతో సుమారు 300 కి.మీ మేర అంతర్జాతీయ ప్రమాణాలతో వైట్ టాపింగ్ చేస్తున్నామన్నారు. ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, రోడ్ల అభివృద్ధి కోసం రూ.1700 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులకు టెండర్ల ప్రక్రియ పూరె్తైందన్నారు. జలమండలి ఆధ్వర్యంలో నగరానికి పొలిమేర్లలోని మున్సిపల్ పట్టణాలకు రూ.1900 కోట్లతో పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా అవుటర్ రింగ్ రోడ్ లోపలి గ్రామాలకు మంచినీటి సరఫరా కోసం రూ.628 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. నగరంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను 109 ప్రాంతాల్లో నిర్మిస్తున్నామన్నారు. విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి సిద్ధ చేసిన ప్రణాళికల నిధుల కోసం పలు ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులతో చర్చలు జరుపుతున్నామని మంత్రి పేర్కొన్నారు. సమీకరణకున్న అన్ని మార్గాలపై అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించడంతోపాటు ప్రతీవారం శాఖాధిపతులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.