రాష్ట్రీయం

27న కెసిఆర్ బెజవాడకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: బెజవాడ కనుకదుర్గ అమ్మవారిని దర్శించుకుని మొక్కు చెల్లించడానికి 27న సిఎం కె చంద్రశేఖర్‌రావు విజయవాడకు వెళ్లనున్నారు. ఈమేరకు విజయవాడ పర్యటన ఖరారైనట్టు అధికార వర్గాల సమాచారం. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పడాలని పలువురు దేవుళ్లకు కెసిఆర్ మొక్కుకున్న విషయం తెలిసిందే. ఈ మొక్కులలో భాగంగా బెజవాడ కనుకదుర్గ అమ్మవారికి ముక్కు పుడక సమర్పించాల్సి ఉంది. ఇప్పటికే తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామికి రూ.5 కోట్ల విలువ చేసే స్వర్ణ సాలిగ్రామహారం, స్వర్ణ కంఠాభరణం, తిరుచనూర్ పద్మావతి అమ్మవారికి ముక్కు పుడక, వరంగల్ భద్రకాళి అమ్మవారికి రూ.3.60 కోట్ల విలువ చేసే బంగారు కిరీటం, కురవి వీరభ్రదస్వామికి రూ.60 వేల విలువ చేసే బంగారు మీసాలు సమర్పించారు. మొక్కుల్లో ఇక మిగిలింది బెజవాడ కనుకదుర్గ అమ్మవారికి ముక్కు పుడక చెల్లింపు ఒకటే. విజయదశమి సందర్భంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుటుంబ సభ్యులతో వెళ్లి కనుకదుర్గ అమ్మవారికి ముక్కు పుడక సమర్పించడానికి కార్యక్రమం ఖరారైనట్టు అధికార వర్గాలు తెలిపాయి.
కెసిఆర్ కంటికి శస్తచ్రికిత్స
ఇదిలావుంటే, తెలంగాణ సిఎం కె చంద్రశేఖరరావుకు ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో కంటికి శస్తచ్రికిత్స జరిగింది. శస్త్ర చికిత్స విజయవంతమైందని, కెసిఆర్ ఉల్లాసంగా ఉన్నారని తెరాస వర్గాలు తెలిపాయి. చంద్రశేఖరరావు 1న ఢిల్లీకి రావటం తెలిసిందే. సిఎంకు కాటరాక్ట్ లేజర్ శస్తచ్రికిత్స జరిగిందని, శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఆయనవెంట కుమారుడు కెటిఆర్, రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు, ఎంపీ, కుమార్తె కవిత, పార్టీ నేతలు, మంత్రులు వెంట ఉన్నారు. శస్త్ర చికిత్స విజయవంతం కావటంపట్ల కుమారుడు, రాష్ట్ర మంత్రి కెటిఆర్ ఆనందం వ్యక్తం చేయటంతోపాటు, డాక్టర్ సచ్‌దేవకు ధన్యవాదాలు తెలిపారు. రెండు, మూడు రోజులు విశ్రాంతి అనంతరం కెసిఆర్ హైదరాబాదుకు తిరుగు ప్రయాణమవుతారు.