రాష్ట్రీయం

2019లోపే సుజల స్రవంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 6: ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష బాబూ జగ్జీవన్ రామ్ సుజల స్రవంతి ప్రాజెక్టు తొలి దశ పెదపూడి రిజర్వాయర్‌ను 2019 ఎన్నికలకు ముందే ప్రారంభిస్తామని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్టవ్య్రాప్తంగా మూడు రోజులపాటు నిర్వహించే ‘జలసిరికి హారతి’ కార్యక్రమాన్ని బుధవారం విశాఖ జిల్లా కశింకోట మండలం నర్సాపురం వద్ద శారదానదికి హారతిచ్చి పూజలు నిర్వహించడం ద్వారా ప్రారంభించారు. అనంతరం గొబ్బూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికపై పెదపూడి రిజర్వాయర్ తొలిదశ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులను విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు అందజేశారు. సభలో మాట్లాడుతూ జిల్లాలోని 8 మండలాల పరిధిలో 133 గ్రామాలకు సంబంధించి 1,30,861 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టుకు 2,022 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. తాను అధికారం చేపట్టిన తొలినాళ్లలో గోదావరి పుష్కరాల సందర్భంగా గోదావరికి అఖండ హారతినిచ్చి పూజలు చేస్తూ మహాసంకల్పానికి సిద్ధపడ్డానని, అదే నదుల అనుసంధానికి దారి తీసిందన్నారు. గోదావరి నుంచి యేటా 3000 టిఎంసి నీరు వృథాగా సముద్రం పాలవుతోందని, ఈ నీటిని మళ్లించి కరవు ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతోనే గోదావరి -కృష్ణా నదులను పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా అనుసంధానించామన్నారు. తద్వారా కృష్ణాడెల్టాలో లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సదుపాయం కల్పించామన్నారు. ఇదే స్ఫూర్తితో గోదావరి నదితో శారదను అనుసంధానిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయం కోసం రైతులు వర్షాలపై ఆధార పడకుండా డెల్టా రైతుల మాదిరి ధీమాగా ఉండేలా ఉత్తరాంధ్ర రైతులకు సాగునీటి వసతి కల్పిస్తానని భరోసానిచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సాగునీటి ప్రాజెక్టుల తక్షణ పూర్తికి నడుం బిగించిందని, దీనిలో భాగంగానే పలు ప్రాజెక్టులకు నిధులు విడుదల చేసి సత్వరమే పూర్తి చేయగలిగామన్నారు. వచ్చే 3 నెలల కాలంలో రాష్టవ్య్రాప్తంగా 28 ప్రాజెక్టులను రూ.13వేల కోట్ల ఖర్చుతో పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఇప్పటి వరకూ రూ.40 వేల కోట్లు వెచ్చించామని, ఈ ఏడాది మరో రూ.10వేల కోట్లు ఖర్చు చేయనున్నామని, ఉపాధి హామీ నిధులు మరో రూ.10వేల కోట్లను కూడా సాగునీటి వసతుల కల్పనకు మళ్లిస్తామన్నారు. రాష్ట్రం సుస్థిర అభివృద్ధి సాధించాలంటే సాగునీటి సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ప్రాజెక్టులతోపాటు బిందు, తుంపర సేధ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 2 కోట్ల ఎకరాల సాగు విస్తీర్ణంఉంటే, ఈ ఏడాది కోటి ఎకరాలకే నీళ్లివ్వగలిగామన్నారు. తక్కువ నీటి వసతితో ఎక్కువ ఫలితాన్నిచ్చే పండ్ల తోటల పెంపకం పట్ల రైతాంగం దృష్టి సారించాలన్నారు.
నీటి భద్రత, సమగ్ర జల వనరుల యాజమాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే జలసిరి హారతికి శ్రీకారం చుట్టానన్నారు. ఏడాదిలో మూడు రోజులపాటు జల నిర్వహణపై ఆలోచిద్దామని, అదే ప్రగతికి సోపానమన్నారు. వర్షాకాలంలో వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టడం ద్వారా భూగర్భ జలాలు ఇంకిపోకుండా కాపాడుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 5 ప్రధాన నదులు, మరో 32 చిన్న నదులు, వాగులు ఉన్నాయని, వీటన్నిటినీ కాపాడుకోవాల్సిన అవసరం మనపై ఉందన్నారు. జల సంరక్షణకు పాటుపడటంతో పాటు నీటి వనరులను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు ఆయన శారదానదిపై రూ.16.1 కోట్లతో నిర్మించిన ఆనకట్టను ప్రారంభించారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా మంత్రులు సిహెచ్ అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఎంపీలు కంభంపాటి హరిబాబు, అవంతి శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
చిత్రం.. విశాఖ జిల్లా నర్సాపురం వద్ద శారదా నదికి పూజలు చేస్తున్న సిఎం చంద్రబాబు