ఆంధ్రప్రదేశ్‌

రోడ్లకూ అంబులెన్స్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 6: దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు అంబులెన్స్‌లను రంగంలోకి దించితే ఎలా ఉంటుంది? ఆశ్చర్యమేస్తోంది కదూ! రోడ్ల ఆరోగ్య సేవలకు అంబులెన్సుల సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. వీటిని రోడ్డు అంబులెన్సులుగా వ్యవహరించనున్నారు. రాష్ట్రంలో దశలవారీగా 200 రోడ్డు అంబులెన్సులను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ కసరత్తు చేస్తున్నారు. పాడైన రహదారుల గురించి ఫిర్యాదు వచ్చిన వెంటనే రోడ్డు అంబులెన్సు అక్కడకు చేరుకుని మరమ్మతులు చేపడుతుంది. అంబులెన్సులోనే ఇందుకు కావాల్సిన కంకర, తదితర సామగ్రి ఉంటుంది. మరమ్మతుల అంచ నా, నిధుల మంజూరు వంటి జాప్యం లేకుండా ఫిర్యాదు వచ్చిన వెంటనే మరమ్మతు చేసే సౌకర్యం ఈ అంబులెన్సుల ద్వారా అందుబాటులోకి రానుంది. వెలగపూడి సచివాలయంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై బుధవారం మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు అంబులెన్సుల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. నాణ్యమైన కోల్డ్ మిక్స్ రోడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దళితులకు ఉపాధి కల్పించేందుకు ఈ అంబులెన్సుల కార్యక్రమం రూపొందించాలన్నారు. లింక్ రోడ్ల నాణ్యతను డ్రోన్ల సహాయంతో తనిఖీ చేయాలని, రోడ్లను ఎ, బి, సి, డి విభాగాలుగా విభజించి నాణ్యత పెంచాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి డ్రోన్ల సహాయంతో రోడ్ల నాణ్యత పరిశీలించి, ర్యాంకింగ్ ఇవ్వాలన్నారు. 4698 అంగన్వాడీ భవనాల నిర్మాణం చేయాల్సి ఉండగా, ఇప్పటికే 1200 భవనాలను పూర్తి చేశామని అధికారులు వివరించారు. మిగిలిన భవనాలను కూడా సత్వరమే పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 4000 కోట్ల రూపాయలతో లింక్ రోడ్లను పూర్తి చేయాలని, గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను తొలిదశలో 157 గ్రామాల్లో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ నాటికి దీనిని పూర్తి చేయాలన్నారు. రోడ్డు సౌకర్యం లేని 2207 గ్రామాలకు 3185 కోట్ల రూపాయలతో రోడ్డు సౌకర్యం కల్పించాలని, ఈ మేరకు త్వరితగతిన నిధులు కేంద్రం మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.
నెలాఖరులోపు వాటర్ కార్పొరేషన్ ప్రణాళిక
రాష్ట్రంలో వాటర్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి సెప్టెంబర్‌లోగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. వాటర్ కార్పొరేషన్, ఎన్టీఆర్ సుజల పథకం, తదితర అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వాటర్ కార్పొరేషన్‌కు సంబంధించి విధివిధానాలను సిఎంతో చర్చించాక తుది రూపు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి 115 లీటర్ల నీటిని సరఫరా చేసేలా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. 48 వేల ఆవాసాల్లో కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నీటి లభ్యత ఆధారంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి, ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఎన్టీఆర్ సుజల పథకంలో భాగంగా మరో 100 క్లస్టర్ల ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌పై జరిగిన సమీక్షలో రాష్ట్రంలో ఈ సంవత్సరం 15 లక్షల మరుగుదొడ్లు నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. స్వచ్ఛ్భారత్ ర్యాంకింగ్‌ల్లో అన్ని జిల్లాలు అగ్రస్థానంలో ఉండేలా చూడాలన్నారు.