ఆంధ్రప్రదేశ్‌

స్మార్ట్ గ్రామాల అభివృద్ధికి 7 స్టార్ల ఫార్ములా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 6: రాష్ట్రంలో స్మార్ట్ గ్రామాల అభివృద్ధికి 7 స్టార్స్ ఫార్ములా ఉపయోగించాలని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన పంచాయితీరాజ్ అధికారులతో స్మార్ట్ విలేజ్ కార్యక్రమంపై బుధవారం సమీక్షం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని, ప్రొఫెసర్ డార్విన్ ఆధ్వర్యంలో జరుగుతున్న బెర్క్లే ఆంధ్రా స్మార్ట్ విలేజ్ కార్యక్రమాలను అనుసంధానం చేయాలన్నారు. ఈ మేరకు రూపొందించిన ఏడు స్టార్ల ఫార్మూలాను అమలు చేయాలన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి విద్యుత్, ఎల్‌ఇడి బల్బుల అమరిక, ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్, మంచినీరు, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, చెత్త నుంచి వర్మీ కంపోస్టు తయారీ, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, సిసి రోడ్లు, స్కూల్, ఆటస్థలం, అంగన్‌వాడీ కేంద్రం, ఇంటర్నెట్ సదుపాయం, ఊరి చెరువు నిర్మాణం, మొక్కలు నాటడం, ప్రతి కుటుంబానికి 10 వేల రూపాయల ఆదాయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.స్మార్ట్ విలేజ్ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో విద్య, యువతకు ఉపాధి, ప్రజారోగ్యం వంటివి కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.