రాష్ట్రీయం

కారు.. సూపర్ స్పీడ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి చారిత్రక విజయం సాధించింది. హైదరాబాద్ చరిత్రలోనే తొలిసారిగా 99 స్థానాల్లో విజయం సాధించి కొత్త రికార్డు సృష్టించింది. వంద సీట్లు గెలుస్తామని చెబుతూ వచ్చిన టిఆర్‌ఎస్ 99 స్థానాల్లో విజయం సాధించి సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఎవరూ ఊహించని స్థాయి విజయం. టిఆర్‌ఎస్ నాయకత్వం సైతం ఊహించని విజయం. విపక్షాలు అసలే ఊహించని, తేరుకోలేని ఘోర పరాజయం ఈ ఎన్నికల్లో కనిపించింది. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు కనీవినీ ఎరగని రీతిలో మెజారిటీ అందించారు. నగరంలోని మొత్తం 150 డివిజన్లలో ఏకంగా 99 డివిజన్లను టిఆర్‌ఎస్ పార్టీని గెలిపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్ బిజెపి తరఫున పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ తరఫున దిగ్విజయ్ సింగ్ లాంటి హేమా హేమీలు జరిపిన ప్రచారానికి ఎలాంటి ప్రయోజనం లభించలేదు. హైదరాబాద్ నగర చరిత్రలో కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు డివిజన్లకు పరిమితం కావడం, టిడిపి ఒకే ఒక స్థానానికి పరిమితం కావడం ఇదే మొదటిసారి. బిజెపి గుడ్డిలో మెల్ల అన్నట్టు మూడు సీట్లను గెలుచుకుంది.
ఉమ్మడి రాజధానిలో టిఆర్‌ఎస్ పార్టీ తన సొంత బలంతోనే మేయర్ పీఠాన్ని చేపట్టనుంది. మేయర్ పీఠం దక్కించుకుంటామని టిఆర్‌ఎస్ పార్టీ మొదటి నుంచి చెబుతున్నా ఈ స్థాయిలో విజయం సాధిస్తామని స్వయంగా గులాబీ దళపతి కెసిఆర్ సైతం ఊహించలేదు. ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లు అవసరం లేకుండా మేయర్ స్థానం కైవలం చేసుకోవడానికి అవసరం అయిన మెజారిటీ లభించిది. విజయం సాధించడమే కాకుండా ఎంఐఎం మద్దతు అవసరం లేకుండా మేయర్ స్థానం దక్కడం టిఆర్‌ఎస్‌కు మరింత సంబరంగా ఉంది. మజ్లిస్ ప్రాబల్యమున్న సౌత్ జోన్‌లోని మైలార్‌దేవులపల్లి వంటి డివిజన్‌లో కూడా టిఆర్‌ఎస్ కారు వేగంగా దూసుకెళ్లి పాతబస్తీలో ఖాతా తెరిచింది.శుక్రవారం నగరంలోని 24 ప్రాంతాల్లోని 36 కేంద్రాల్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి చేపట్టిన కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా తొలి అరగంటలోనే దాదాపు ఇరవై డివిజన్ల ఫలితాలు ఖరారైనా, పురానాపూల్ డివిజన్ పోలింగ్ కొనసాగుతున్నందున వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. సాయంత్రం అయిదు గంటల నుంచి అధికారులు ఫలితాలను వెల్లడించినా, జిహెచ్‌ఎంసి కమిషనర్ రాత్రి తొమ్మిది గంటలకు అధికారికంగా ఫలితాలను ప్రకటించారు. మజ్లిస్ పార్టీ 44 స్థానాలను గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. టిఆర్‌ఎస్ విజయ పరం పర ప్రారంభం కాగానే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు చేరుకుని సంబరాలు జరుపుకున్నారు. ఎక్కడికక్కడే విజేతలు ఉత్సవాల్లో మునిగిపోయారు. ఫలితాలు వెలువడుతుండగా, కెటిఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకోగానే కార్యకర్తలు ఆయన్ని భుజాలపైకి ఎత్తుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సాయంత్రం తెలంగాణ భవన్‌కు చేరుకొని విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ భవన్‌లో ఆనందంతో నృత్యాలు చేశారు.

11న మేయర్ ఎన్నిక
నగర ప్రథమ పౌరుడు మేయర్, డిప్యూటీ మేయర్లను ఈ నెల 11న ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికకు సంబంధించి అంతకు ముందే సభ్యులకు నోటీసు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికకు సంబంధించి హైదరాబాద్ కలెక్టర్‌ను రిటర్నింగ్ అధికారిగా నియమించినట్లు తెలిపారు.