బిజినెస్

ఎమ్‌సిఎల్, సిసిఎల్ మధ్యంతర డివిడెండ్ రూ. 4,215 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: తమ అనుబంధ సంస్థ మహానంది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎమ్‌సిఎల్) ఈ ఆర్థిక సంవత్సరానికి (2015-16)గాను 2,758.45 కోట్ల రూపాయల మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించినట్లు శుక్రవారం ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. అలాగే డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలలకుగాను తమ మరో అనుబంధ సంస్థ సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సిసిఎల్) మధ్యంతర డివిడెండ్‌గా 1,457 కోట్ల రూపాయలను ప్రకటించినట్లు కోల్ ఇండియా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపింది. వెయ్యి రూపాయల ముఖ విలువ కలిగిన 18,64,009 ఈక్విటీ షేర్లకు ఒక్కోదానికి 14,798.48 రూపాయల చొప్పున మొత్తం 2,758.45 కోట్ల రూపాయలను మహానంది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ తమ మధ్యంతర డివిడెండ్‌గా 2015-16కు ప్రకటించింది. ఇకపోతే వెయ్యి రూపాయల ముఖ విలువ కలిగిన 94,00,000 ఈక్విటీ షేర్లకు ఒక్కోదానికి 1,550 రూపాయల చొప్పున మొత్తం 1,457 కోట్ల రూపాయల మధ్యంతర డివిడెండ్‌ను గత ఏడాది ఏప్రిల్-డిసెంబర్‌కుగాను సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ప్రకటించింది.