Others

చిరంజీవులు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1956లో నిర్మాత డిఎల్ నారాయణ

నిర్మాణంలో వేదాంతం రాఘవయ్య

దర్శకత్వంలో ఎన్‌టిఆర్, జమున, గుమ్మడి

ప్రధాన పాత్రలుగా నిర్మించిన చిత్రం

‘చిరంజీవులు’. మల్లాది రామకృష్ణ శాస్ర్తీ

రచనలో పాటలు, మాటలతో వారి సాహిత్య

విశ్వరూపం ప్రతిబింబించింది. ఓ గ్రామంలో

శారద (జమున), మోహన్ (ఎన్టీఆర్)

బాల్యంనుండే అభిమానించుకుని ప్రేమగా

మలచుకుంటారు. పట్నం వెళ్లిన

ఎన్టీఆర్‌ను రత్నం (పేకేటి) రౌడీలతో

కొట్టించడంతో గాయపడిన అతడిని

తిరునాళ్ళలో పరిచయం అయిన డాక్టర్

కృష్ణ (గుమ్మడి) రక్షించి తన నర్సింగ్

హోంలో చికిత్స చేస్తుంటాడు. అనూహ్య

సంఘటనలతో శారద పెళ్లి డాక్టర్ కృష్ణతో

జరగడం, చికిత్స పొందుతున్న

ఎన్‌టిఆర్‌కు శారద పెళ్లి వేరొకరితో

జరిగిందని తెలిసి ఆత్మహత్యా ప్రయత్నం

చేయగా, తిరిగి డాక్టర్ కృష్ణ రక్షించగా,

అతనికి తెలియకుండా జమున పరిచర్యలు

చేసి కోలుకునేలా చేస్తుంది. శారదపై డాక్టర్

కృష్ణకు అనుమానం కలిగేలా చేయడంతో

ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది.

గాలివానలో చిక్కుకున్న ఎన్‌టిఆర్‌పై ఓ

పెద్ద చెట్టుపడి కళ్లు పోతాయి. ఇక్కడ

గుడ్డివానిగా ఎన్‌టిఆర్ నటన ప్రేక్షకుల

గుండెలను పిండేసింది. రిస్క్ అని తెలిసినా

కాంటాక్టు లెన్సు వాడి గుడ్డివానిగా

అసాధారణ నటన చూపారు.

నటీనటులందరూ పాత్రలకు ప్రాణం పోశారు.

మల్లాదివారి సాహిత్యం, ఘంటసాల

సంగీతంలో లీల, ఘంటసాల పాడిన

‘తెల్లవారవచ్చె’, ‘కనుపాప కరువైన’,

‘ఎందాక ఎందాక’, ‘చికిలింత సొగసు’ వంటి

గీతాలు నేటికీ అలరిస్తున్నాయి. ‘మనసైన

పాట ఆరని పాటా’ అంటూ సాగే ఆలాపన

వివిధ సందర్భాలలో నేపథ్యంగా వచ్చి

ఆకట్టుకుంటుంది. విషాదాంతమైన కథే

అయినా నటీనటుల అభినయ ప్రాభవం,

ఘంటసాల సంగీత మాధుర్యం, గాయకుల

గానంతో విరాజిల్లిన ఈ చిత్రం తెలుగు

ప్రేక్షక హృదయాలలో చిరంజీవిగా

నిలిచిపోయింది.

-ఎస్‌ఎస్ శాస్ర్తీ, విశాఖపట్నం