Others

అందుకే... మహానటి (శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాముడు దొంగతనం చేశాడు.

జైలుపాలయ్యాడు. తల్లి మరణించింది.

చెల్లెలు చెదిరిపోయింది. శిక్ష తరువాత

రాముడు బయటికొచ్చాడు. చెల్లి జాడ

తెలుసుకున్నాడు. చదవిస్తానని ప్రామిస్

చేశాడు. విధి ఆడిన వింత నాటకంలో మళ్లీ

విడిపోయాడు. చెదిరిపోయిన చెల్లి ఓ

వైద్యుడివద్ద ఆశ్రయం పొందింది. అన్న -ఓ

కూరగాయలు అమ్ముకునే యువతికి

పరిచయమయ్యాడు. కాలం కనికరం

ఉన్నది కూడా. పెళ్లి చేసుకోవాలని ఆశ

పడుతున్న ఓ ఉత్తమ కుర్ర వైద్యుడి వద్ద

చెల్లి ఉందని తెలుస్తుంది. అతని వద్దే

డ్రైవర్‌గా చేరాడు అన్న. విషయం డాక్టర్‌కు

చెప్పొద్దన్నాడు. కానీ, విలన్ వీరభద్రయ్య

వల్ల విషయం తెలిసిపోయింది. ఈలోగా

వీరభద్రయ్య హత్యకు గురయ్యాడు.

రాముడు హంతకుడన్న ముద్రపడింది.

తనతో స్నేహం చేసిన యువతి

చాకచక్యంతో -నేరం తనది కాదని

నిరూపించుకున్నాడు రాము. హంతకుడు

రౌడీ బాబులు దొరికిపోయాడు. కథ

సుఖాంతమైంది.
కెవి రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా

కథ ఇది. అదే ‘దొంగరాముడు’.

కూరగాయలు అమ్ముకునే యువతిగా

అద్భుతమైన నటన ప్రదర్శించింది సావిత్రి.

కూరగాయల గంప నెత్తిన పెట్టుకుని వూళ్లో

అమ్ముకునే సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి

వచ్చింది. సావిత్రి కోసం -గంప తయారైంది.

నిండా గడ్డివేసి, పైన నాలుగైదు

కూరగాయలు పేర్చారు. గంప

నెత్తికెత్తుకున్న సావిత్రి ఆశ్చర్యపోయిందట.

తేలిగ్గా ఉందేంటని ఆరా తీసింది. విషయం

తెలుసుకుని మారాం చేసింది. ‘గంపనిండా

కూరగాయలు నింప’మని దర్శకుడిని

అడిగింది. ‘గంపలో ఏమున్నాయో

ఆడియన్స్‌కి కనిపించదులే’ అని

కొట్టిపారేశారట కెవి రెడ్డి. సావిత్రి

వినిపించుకోలేదు. బరువుతో

నటించినపుడు పాత్ర బరువు తెలుస్తుందని

అడిగిందట. అలా నిండుగంపను నెత్తిన

పెట్టుకుందట సావిత్రి. ఇక్కడ కనిపించే

సన్నివేశం అదే. సినిమా దొరికితే చూడండి.

గంపలో కూరగాయలు కనిపిస్తాయేమో

పరిశీలించడి.

-పర్చా శరత్‌కుమార్ 9849601717