బిజినెస్

నైపుణ్యం మెరుగు.. మేథోరాసి తరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 13: ప్రపంచ మానవ మేథో సంపద పెంపుదల సూచిలో భారత్ అత్యంత ఘోరమైన స్థానంలో ఉందని జెనీవా కేంద్రంగా నడిచే ప్రపంచ ఆర్థిక మండలి (డబ్ల్యుఇఎఫ్) స్పష్టం చేసింది. మానవ వనరులు, నైపుణ్యాభివృద్ధి సాధనలో భారత్ ప్రపంచ దేశాల్లోనే వెనుకబడి ఉందని సర్వే సారాంశాన్ని వెల్లడించింది. ఉపాధి అవకాశాల్లో స్ర్తి, పురుషుల మధ్య వ్యత్యాసం కారణంగా 103వ స్థానంలో ఉన్న భారత్.. నైపుణ్యాభివృద్ధిలో 65వ స్థానంలో ఉందని సర్వేలో పేర్కొంది. ఒక దేశంలోని ప్రజల విజ్ఞానం, నైపుణ్యం ఆ దేశ స్థాయిని, సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయి. ఈ కోణంలోనే సర్వే నిర్వహించినట్టు డబ్ల్యుఇఎఫ్ తెలిపింది. అయితే, గత ఏడాది సర్వేలో 105వ స్థానంలో ఉన్న భారత్.. ఈసారి 103వ స్థానం దక్కించుకోవడం గమనార్హం. కాగా, నిరుడు ప్రథమ స్థానంలో నిలిచిన ఫిన్‌లాండ్ ఈసారి ద్వితీయ స్థానంలో ఉండగా, ద్వితీయ స్థానంలోని నార్వే ఈసారి ప్రథమస్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఇక బ్రిక్స్ దేశాల వరుసలో చూసుకున్నా భారత్ చిట్టచివరి స్థానంలోనే ఉందని డబ్ల్యుఇఎఫ్ ప్రకటించింది.
చివరకు దక్షిణాసియా దేశాల ప్రాతిపదికన చూసినా శ్రీలంక, నేపాల్ కంటే భారత్ దిగువ స్థానాల్లోనే ఉందని డబ్ల్యుఇఎఫ్ వెల్లడించింది. మరోవైపు తాజా జాబితాలో రష్యా 16వ స్థానంలో ఉండగా, చైనా 34, బ్రెజిల్ 77, దక్షిణాఫ్రికా 87వ స్థానాల్లో నిలిచాయ. భారత్ వెనుకబాటుకు ప్రధాన కారణాలు ప్రాథమిక విద్య సామర్థ్యాన్ని పెంచకపోవడం, మానవ వనరులను సమర్థంగా వినియోగించుకోలేకపోవడమేనని సర్వేలో స్పష్టం చేసింది. భారత్‌లో 35 నుంచి 54 ఏళ్ల మధ్య వయసున్న జనాభా ఎక్కువ శాతం అసంఘటిత, అనుత్పాదక రంగంలోనే ఉన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. అయనప్పటికీ ‘నిజానికి భారత్ అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నా, సరైన మార్గదర్శకత్వంలో పయనిస్తోంది’ అని డబ్ల్యుఇఎఫ్ వ్యాఖ్యానించడం విశేషం. డబ్ల్యుఇఎఫ్ వెల్లడించిన మానవ పెట్టుబడి సూచిలో మూడో స్థానంలో స్విట్జర్లాండ్ ఉంటే, అమెరికా, డెన్మార్క్‌లు నాలుగైదు స్థానాల్లో ఉన్నాయి. ‘ప్రపంచంలో నడుస్తోన్న నాల్గవ పారిశ్రామిక విప్లవం ఉపాధి రంగాన్ని పెద్దగానే దెబ్బతీసింది. అంతేకాదు, అనేక దేశాలు నైపుణ్య కొరతను ఎదుర్కోవడానికీ ఇదే కారణం’ అని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వ్యవస్థాపకుడు, దాని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్లాస్ స్కావ్ సర్వే నివేదికలో పేర్కొన్నారు.