ఆంధ్రప్రదేశ్‌

సిఎం ఆరోగ్య కేంద్రాలతో మరిన్ని వైద్యసేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 13: ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల ద్వారా అందించే వైద్య సేవల వివరాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, చికిత్స కోసం ఆయా కేంద్రాలకు ప్రజలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం విజయవాడలోని సబ్‌కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 13 జిల్లాల వైద్య ఆరోగ్య, మున్సిపల్, ఐసిడిఎస్ అధికారులతో సీజనల్ వ్యాధులపై ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఇతర సమన్వయ శాఖల అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో పట్టణ ప్రాంతాలలో ఉండే అర్బన్ ఆరోగ్య కేంద్రాలను ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలుగా మార్చి, మెరుగైన వైద్య సేవలను, 28 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ ఆరోగ్య కేంద్రాలు ప్రతి రోజు పనిచేస్తాయని, ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. ఎంబిబిఎస్ డాక్టర్లు చికిత్సకు వచ్చే ప్రజలకు వైద్యసేవలను అందిస్తారన్నారు. ఈ కేంద్రాలకు సెలవులు ఉండవని, వారం రోజులు వైద్యులు అందుబాటులో వుంటారన్నారు. చికిత్సకోసం వచ్చే రోగి ఆరోగ్యం కారణాలు తెలుసుకుని ఆయా రోగాలకు సంబంధించిన స్పెషలిస్టు డాక్టరును టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానం చేసి వైద్యసేవలను సత్వరం అందిస్తారన్నారు. గతంలో ఉండే అర్బన్ వైద్య కేంద్రాలలో వైద్య సేవలకు భిన్నంగా ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు అత్యుత్తమ వైద్య సేవలను ప్రజలకు అందించడం ప్రధాన ఉద్దేశ్యంగా పనిచేస్తున్నాయన్నారు. గతంలో 212 అర్బన్ హెల్త్ సెంటర్లు వుండేవని, వాటి స్థానంలో 222 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు తీసుకొచ్చామన్నారు. రిజిస్ట్రేషన్, ఇనె్వస్టిగేషన్, కౌనె్సలింగ్ విధానంలో జాప్యం జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని వాటిని సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలోనే ఎమ్మార్ టీకాలు వేయడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిపినందుకు ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానని మంత్రి తెలిపారు.
సిద్ధార్థలో సీట్లు పెంపు
సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం ఉన్న 150 సీట్లను 200 సీట్లకు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. సిద్ధార్థ కళాశాలలో ప్రస్తుతం ఉండే ఎయిమ్స్ విద్యార్థులు మంగళగిరికి వెళ్లిన తరువాత 200 సీట్లు పెంపుదల జరుగుతుందన్నారు. సిద్ధార్థ మెడికల్ కాలేజీకి వచ్చే అదనపు సీట్లలోని కోర్సులకు అనుసంధానంగా వౌలిక వసతులను, వసతి సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదనంగా కేటాయించే 50 సీట్లకు గాను కాలేజీ ప్రాంగణంలోనే అదనపు వౌలిక వసతులను, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్‌లను అభివృద్ధి చేస్తామన్నారు. ఎయిమ్స్‌కు సంబంధించి డే స్కాలర్లు ప్రస్తుతం సిద్ధార్థ మెడికల్ కాలేజీలో చదువుకున్నందున వారి స్థానంలో నూతనంగా వచ్చే 50 సీట్లకు సంబంధించి ప్రభుత్వపరంగా అన్ని చర్యలను తీసుకుంటామన్నారు.