బిజినెస్

నిన్న అనివార్యం.. నేడు అలవాటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: దేశంలో పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రజలు డిజిటల్ లావాదేవీలు జరపడం తొలుత అనివార్యంగా, ఇప్పుడు అలవాటుగా మారిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తోడు సాంకేతిక పరిజ్ఞానం పురోభివృద్ధి చెందుతుండటంతో మున్ముందు నగదు రహిత లావాదేవీలు మరింత ఊపందుకోవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది నవంబర్ 8వ తేదీన పాత 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత నుంచి దేశంలో అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్ల చెలామణి పరిమాణం తగ్గిందని జైట్లీ తెలిపారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం అనివార్యంగా నగదు రహిత లావాదేవీలను జరపాల్సిన అవసరం ఏర్పడటంతో ప్రజల్లో ఎక్కువ మంది డిజిటల్ లావాదేవీలను ఆశ్రయించారని, నగదుతో జరిపే చెల్లింపుల కంటే నగదు రహితంగా జరిపే చెల్లింపులే మరింత సౌకర్యవంతంగా ఉండటంతో ఇప్పుడు డిజిటల్ లావాదేవీలను జరపడం ప్రజలకు అలవాటుగా మారిందని జైట్లీ అన్నారు. ‘పెద్ద నోట్ల రద్దు అనంతరం తారాస్థాయికి చేరిన డిజిటల్ లావాదేవీలు ఆ తర్వాత స్వల్పంగా తగ్గినప్పటికీ ఇప్పుడు మళ్లీ ఊపందుకుంటున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. దేశంలో నగదు రహిత చెల్లింపు సేవలను అందించేందుకు అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ అభివృద్ధి చేసిన ‘తేజ్’ మొబైల్ యాప్‌ను జైట్లీ సోమవారం న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వివిధ చర్యలను చేపడుతోందని, దీంతో ఈ రంగం మరింత పురోభివృద్ధిని సాధించే దిశగా పయనిస్తోందని ఆయన చెప్పారు.
‘తేజ్’ సేవలు ఉచితం : గూగుల్
కాగా, యుపిఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్)తో రూపొందించిన తేజ్ యాప్‌ను భారత్ కోసమే అభివృద్ధి చేశామని, సామాన్య ప్రజలు సైతం సులభంగా ఉపయోగించుకోగలిగేలా రూపొందించిన ఈ యాప్ సాయంతో వినియోగదారులు ఎటువంటి చార్జీలు లేకుండా నేరుగా తమ బ్యాంకు ఖాతాల నుంచి కేవలం చిన్న మొత్తాల్లోనే కాకుండా పెద్ద మొత్తాల్లో సైతం చెల్లింపులు జరుపుకోవచ్చని గూగుల్ స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న అత్యధిక శాతం స్మార్ట్ఫోన్లలో పనిచేయగలిగే విధంగా తీర్చిదిద్దిన ఈ యాప్ ఆంగ్లంతో పాటు ఏడు భారతీయ భాషలను (హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, తమిళ్, తెలుగు) సపోర్టు చేస్తుందని ఆ సంస్థ వివరించింది. నాలుగు బ్యాంకుల (యాక్సిస్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, ఎస్‌బిఐ) భాగస్వామ్యంతో పనిచేసే ఈ యాప్‌ను ప్రస్తుతం దేశంలోని 55 బ్యాంకులతో అనుసంధానించినట్లు గూగుల్ తెలిపింది.

చిత్రం..గూగుల్ ‘తేజ్’ మొబైల్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ