బిజినెస్

ఎస్‌బిఐ లైఫ్ ఐపిఓ ఓవర్ సబ్‌స్క్రైబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐపిఓ బిడ్డింగ్ చివరి రోజయి శుక్రవారం మధ్యాహ్నం సమయానికే 1.43 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. పూర్తి గడువు ముగిసే సమయానికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఐపిఓ ద్వారా మొత్తం రూ.8,400 కోట్లు సేకరించాలని కంపెనీ భావిస్తోంది. మొత్తం 8,82,00,000 షేర్లు విక్రయించనుండగా, 12,64,70,379 షేర్లకు బిడ్డింగ్‌లు వచ్చాయి. ఎస్‌బిఐ లైఫ్ ఇప్పటికే తన ప్రధాన ఇనె్వస్టర్లనుంచి రూ.2,226 కోట్లు సేకరించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫ్రాన్స్‌కు చెందిన బిఎన్‌పి పరిబాస్ కార్డ్ఫి జాయింట్ వెంచర్ అయిన ఎస్‌బిఐ లైఫ్ ఐపిఓలో పది రూపాయల ముఖ విలువ కలిగిన 12 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. షేర్ ప్రైస్‌బ్యాండ్‌ను రూ.685-700గా నిర్ణయించారు.