రాష్ట్రీయం

21 లక్షల గొర్రెల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: రాష్ట్రంలో ఇప్పటి వరకు లక్షా 860 మందికి 21,18,060 గొర్రెలను పంపిణీ చేయడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతోషాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో గొర్రెల పంపిణీపై జిల్లాల వారీగా సమీక్షించారు. ఇంత తక్కువ సమయంలో లక్షకు పైగా యూనిట్లకు 21 లక్షలకు పైగా గొర్రెలను పంపిణీ చేయడం దేశ చరిత్రలోనే మొదటిసారి అని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష యూనిట్ల పంపిణీ పూర్తయిన సందర్భంగా పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డిని, ఇతర అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు.
ప్రతి గ్రామానికో నర్సరీ ఏర్పాటు
వచ్చే సంవత్సరం హరితహారం కార్యక్రమం నిర్వహణ కోసం ప్రతి గ్రామానికి ఒక నర్సరీ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో వాటిని నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పడే గ్రామ పంచాయతీలను కలుపుకుని 10 వేల గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు కావాలని అన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే నగర పంచాయతీలనూ కలుపుకుని వంద వరకు ఉన్న కార్పొరేషన్లను, మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా నర్సరీలు ఏర్పాటు చేయాలని ఆయన వారికి సూచించారు. నర్సరీల్లోని మొక్కలను ప్రజలకు పంపిణీ చేసి వాటిని నాటించాలని ఆయన సూచించారు.