గుంటూరు

పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదనందిపాడు, సెప్టెంబర్ 3: మానవాళి మనుగడకు పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ బాధ్యతను అంతా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే భావి తరాల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు తోడ్పాటునందించిన వారవుతామని అభిప్రాయపడ్డారు. పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శనివారం స్వచ్ఛ్భారత్ అవార్డు గ్రహీతలకు అభినందన సభ నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన జస్టిస్ లావు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా జీవించ గలమన్నారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఉపాధ్యాయులు నిత్య విద్యార్థిగా మసలుకుంటూ ఆత్మవిమర్శ చేసుకుని పనిచేయాలన్నారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ పెదనందిపాడు గ్రామాభివృద్ధికి కోటి రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్తపాలెం, బికెపాలెం ప్రాథమిక పాఠశాలలకు డిజిటల్ తరగతులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ నిషేధంపై చట్టంతెస్తే సరిపోదని ప్రజలు కూడా అందుకు సహకరించాలని ఉద్బోధించారు. సభలో విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్, తహశీల్దారు డి మోహన్‌రావు, డిఇఒ ఎన్ రఘుకుమార్, ఎంపిడిఒ షేక్ ఖాజావలి, ఎంపిపి ఎం నగరాజ కుమారి తదితరులు ప్రసంగించారు. అవార్డు గ్రహీతలు ఎం జవహర్‌రాణి, జి శ్రీనివాసరావు, శ్యామలాదేవిలను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు.