రాష్ట్రీయం

హనుమంత వాహనంపై రామభద్రుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 28: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు గురువారం ఉదయం శ్రీరాముని అవతారంలో స్వామి వారు తనకు అత్యంత ప్రియ భక్తుడైన హనుమంతునిపై తిరుమల మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. సాలగ్రామ హారం, స్వర్ణవజ్ర ఖచిత ఆభరణాలతో విశేషాలంకార భూషితుడైన స్వామివారు తిరువీధుల్లో ఊరేగుతున్నంత సమయం గ్యాలరీలలో ఉన్న భక్తులు స్వామివారి వాహన సేవ తమ వద్దకు రాగానే కర్పూర నీరాజనాలు పట్టి చేసిన గోవిందనామస్మరణతో తిరుమలక్షేత్రం మారుమోగింది. చెక్క్భజనలు, కోలాటాలు స్వామివారి వాహనం ముందు నడుస్తూ కీర్తిస్తూ నర్తించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో టిటిడి పెద్దజియ్యర్, చిన్నజియ్యర్, టిటిడి ఇఓ ఎకె సింఘాల్, జెఇఓ శ్రీనివాసరాజు, సివిఎస్‌ఓ ఆకే రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణరథంపై దేవదేవుని విహారం
శ్రీ స్వామివారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోరోజైన గురువారం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతుడైన వెంకటాద్రీశుడు స్వర్ణరథంపై అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఓ వైపు ఆహ్లాదకరమైన వాతావరణం, సూర్యకిరణాలు స్వామివారు అధిరోహించిన స్వర్ణరథంపై పడుతుండటంతో దేదీప్యమైన వెలుగుల మధ్య స్వామి, అమ్మవార్ల స్వర్ణరథ ఊరేగింపు ఆద్యంతం భక్తిపారవశ్యంతో సాగింది. స్వర్ణరథం మోదాడును భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ ముందుకు లాగారు. అత్యధిక సంఖ్యలో మహిళలు ఈ స్వర్ణరథాన్ని ముందుకు లాగడంలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. స్వర్ణరథం ముందు భజన, కోలాట బృందాలు, కళాకారుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గజ తురగ వృషభ పదాది దళాలు యథావిధిగా స్వర్ణవాహనం ముందు సాగిన తీరు స్వామివారి రాజవైభవాన్ని చాటాయి.
గజ వాహనంపై శ్రీమన్నారాయణుని విహారం
శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వరోజైన గురువారం రాత్రి శ్రీ స్వామివారు గజ వాహనంపై అధిరోహించి భక్తులను అనుగ్రహించారు.

చిత్రాలు..హనుమంత వాహనంపై విహరిస్తున్న శ్రీమలయప్ప స్వామి
* స్వర్ణ రథంపై ఊరేగుతున్న శ్రీమలయప్పస్వామి