రాష్ట్రీయం

వస్తోంది కృష్ణమ్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 29: విజయ దశమి పండుగ వేళ దశాబ్దాల కల సాకారం కాబోతోంది. కల్వకుర్తి ప్రాంతానికి కృష్ణాజలాలు తాకబోతున్నాయ. దాదాపు మూడు దశాబ్దాల పాటు పోరాటాలు, ఉద్యమాలు ఏ ఎన్నికలు వచ్చినా నేతల మొదటి ప్రసంగం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం గురించే . ఆ పోరాటాల ఫలితం నేడు సాకారమవుతున్న వేళ రైతాంగంలో కొత్త ఆశలు చిగురించనున్నాయి. బీడువారిన భూములను చూసి కళ్లు చెమ్మగిల్లిన అన్నదాతల కన్నీరు తుడిచేందుకు కృష్ణవేణి బిరబిరా తరలిరానుంది. కొన్ని గంటల్లో కల్వకుర్తి నియోజకర్గ పంటపొలాల్లో నాట్యం
చేయనుంది. మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకంలో (కల్వకుర్తి లిఫ్ట్)లో భాగంగా 29వ ప్యాకేజీ పరిధిలోని దుందుభి నది వాగుపై ఆక్విడెక్ట్ పూర్తికావడంతో కాలువల ద్వారా కృష్ణా జలాలు పారనున్నాయి.
గత 20 ఏళ్లుగా కల్వకుర్తి ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయి. తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కెసిఆర్, భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ప్రాజెక్టు పనులపై దృష్టిపెట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయంచారు. మంత్రి హరీశ్ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ, నెలకోసారి సందర్శించారు. మంత్రి స్వయంగా రంగంలోకి దిగడంతో కాంట్రాకర్లు, అధికారులు పనులు వేగవంతం చేయడంతో అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూరె్తైంది. ముఖ్యంగా కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా కృష్ణాజలాలు కల్వకుర్తి ప్రాంతానికి రావాలంటే దుందుభి నది వాగు దాటి రావాల్సిందే. అయితే ఈ విషయంపై అందరిలో నది దాటి నీటిని ఎలా తీసుకువస్తారనే ప్రశ్న ఉత్పన్నమయ్యేది. అయితే దుందుభి వాగుపై ఆక్విడెక్ట్ (వంతెన) నిర్మించి దీనిద్వారా కృష్ణా జలాలను ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నారు.
ఇదిలావుండగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని సిల్వేర్ గ్రామం దగ్గర నిర్మించిన వంతెన ద్వారా సాగునీటిని విడుదల చేయడానికి మంత్రి హరీశ్‌రావు శనివారం వస్తున్నారు. శ్రీశైలంలో అనుకులంగా వరద ఉండటంతో కల్వకుర్తి ప్రాజెక్టుకు సంబంధించిన మోటార్లను ఇప్పటికే ఆన్ చేశారు. నాగర్‌కర్నూల్ సమీపంలోని గుడిపల్లి గుట్టు రిజర్వాయర్ నుంచి 29 ప్యాకేజీకి జలాలు తరలిరానున్నాయి. అందుకు సైతం ఏర్పాట్లు పూర్తయ్యాయ. అక్టోబర్ 1న మంత్రులు పూజలు చేసేందుకు సైతం సిద్ధమయ్యారు. శనివారం ప్రారంభం కానున్న 29వ ప్యాకేజీ నుంచి కల్వకుర్తి ప్రాంతానికి కృష్ణాజలాలు విడుదల చేసే కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు జరిగాయ. నాలుగు రోజుల క్రితమే మోటార్లను ఆన్ చేయడంతో దాదాపు అవంచ వరకు ఇప్పటికే నీరు వచ్చింది. ప్రస్తుతం 90 కిలోమీటర్ల పరిధిలోని వివిధ గ్రామాలకు సాగునీరు అందుతోంది. 122 కిలోమీటర్ల వద్ద కల్వకుర్తి మండలం మదారం గ్రామం వరకు 29వ ప్యాకేజీ ద్వారా జలాలు పారించనున్నారు.

చిత్రాలు..దుందుభి నది వాగుపై కృష్ణా జలాలను పారించేందుకు నిర్మించిన ఆక్విడెక్ట్.
* నీరు సరఫరాకు సిద్ధమైన కల్వకుర్తి కాల్వ