రాష్ట్రీయం

కావాలంటే అడుక్కోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 29: పోతిరెడ్డిపాడుకు నీళ్లు కావాలంటే రిక్వెస్టు చేయాలి, అడుక్కోవాలి అంతే తప్ప దాదాగిరిగా తీసుకెళ్తామంటే కుదరదంటే కుదరదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కరాకండిగా తేల్చిచెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా జల విద్యు త్ ఉత్పత్తి కోసం నిర్మించిన ప్రాజెక్టు, దీని నుంచి పోతిరెడ్డిపాడ్‌కు నీటిని ఎలా తీసుకెళ్తారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు నీళ్లు ఇవ్వకుండా నాగార్జునసాగర్‌కు నీరు ఎలా తీసుకెళ్తారని కృష్థా బోర్డు చైర్మన్ శ్రీవాస్తవ ఎలా అంటారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పోతిరెడ్డిపాడుకు నీటిని తరలించడంపై తీవ్రంగా స్పందించారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నీళ్లు వెళ్లితీరాల్సిందేనని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్‌కు కానీ కృష్ణాడెల్టాకు కానీ జూరాల, ఆర్డీఎస్‌కు కానీ నికర జలాల కేటాయింపు ఉంది, వీటికి నీటిని వాడుకోవడానికి అధికారం ఉంది తప్ప పోతిరెడ్డిపాడుకు తీసుకెళ్లే అధికారం ఎవరికీ లేదన్నారు. మిగులు జలాలు ఉంటే తీసుకెళ్లవచ్చు, అది కూడా రిక్వెస్టు చేసి తీసుకెళ్లవచ్చు అంతే కానీ నాగార్జునసాగర్‌కు ఎలా తీసుకెళ్తారని ఆంధ్ర సర్కార్ అనడమంటే
మొగణ్ణికొట్టి మొగసాలకే ఎక్కడమేనని ముఖ్యమంత్రి ఏద్దేవా చేశారు.
నల్లగొండ ఉప ఎన్నిక రాదు
నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తుందన్న ప్రచారంపై ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించారు. ఉప ఎన్నికల వస్తుందని ఎవరు చెప్పారు, మీరే మీరే రస్తారు మళ్లీ మీరే అడుగుతారా? అని ఎదురు ప్రశ్నించారు. ఉప ఎన్నిక వచ్చే అవకాశమే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎక్కడ ఎన్నికలు జరిగిన అప్రతిహతంగా టిఆర్‌ఎస్‌దే విజయం, ఇందులో అనుమానం ఎందుకని ప్రశ్నించారు.
దసరా కానుకగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు
దసరా కానుకగా మరో 20, 25 రోజులలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కోర్టు అభ్యంతరం చెప్పలేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తే ఇచ్చుకోవచ్చని కోర్టు చెప్పిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.