రాష్ట్రీయం

ట్యాంపరింగ్ సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 29: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ వద్ద జరుగుతున్న జలచౌర్యంపై కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డు ఉదాసీనత ప్రదర్శించడంపై తెలంగాణ తీవ్ర నిరసన తెలిపింది. శుక్రవారం జలసౌధలో జరిగిన కెఆర్‌ఎంబి భేటీ వాడి వేడిగా సాగినా, నిర్ణయం లేకుండానే ముగిసిపోయింది. పోతిరెడ్డిపాడు వద్ద కెఆర్‌ఎంబి ఏర్పాటు చేసిన టెలిమెట్రీ స్టేషన్ నమోదు చేస్తున్న ప్రవాహ సమాచారాన్ని మొత్తంగా ట్యాంపర్ చేసిన సంబంధిత ఏజెన్సీ కాంట్రా క్టు రద్దు చేసి, క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. అందుకు కెఆర్‌ఎంబి సుముఖత చూపలేదు. టెలిమెట్రీ ద్వారా జరుగుతున్న ప్రవాహ లెక్కలను తారుమారు చేసినట్టు సాక్ష్యాధారాలను కెఆర్‌ఎంబి ముందు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం పెట్టింది. రికార్డులను మార్చిన విషయాన్ని మెకట్రానిక్స్ సంస్థ ప్రతినిధులు సైతం సమావేశంలో అంగీకరించారు. కాని ఆ సంస్థపై క్రిమినల్
చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌పై కెఆర్‌ఎంబి స్పందించలేదు. ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలన్న డిమాండ్‌ను కూడా కెఆర్‌ఎంబి పెడచెవిన పెట్టింది. పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాల చౌర్యం భారీగా జరుగుతుందంటూ తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు ఆధారాలతో ఫిర్యాదు చేసిన కారణంగా నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల పోతిరెడ్డిపాడు వంటి కృష్ణా ప్రాజెక్టుల వద్ద టెలిమెట్రీ యంత్రాలను కెఆర్‌ఎంబి ఆధ్వర్యంలో అమర్చారు. దీంతోపాటు ప్రవాహ నమోదును ప్రామాణీకరించేందుకు డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఎఇలతో కూడిన ముగ్గురు సభ్యుల బృందాలు కూడా ఏర్పాటయ్యాయి. సెప్టెంబర్ 20, 21 తేదీల్లో ఈ బృందాలు ప్రాజెక్టుల వద్ద విస్తృతంగా పర్యటించి ఎడిసిపి అనే మొబైల్ సాంకేతిక పరిజ్ఞానంతో టెలిమెట్రీ పాయింట్‌ను ప్రామాణీకరించారు. సెప్టెంబర్ 21నుండి పోతిరెడ్డిపాడు నుండి భారీ ప్రవాహం వెళ్తున్నా టెలిమెట్రీ పరికరాలు దానిని సరిగ్గానే నమోదు చేస్తున్నా మెకట్రానిక్స్ ప్రతినిధులు లెక్కలను తారుమారు చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి ప్రవాహం 12వేల క్యూసెక్కులు ఉండగా, టెలిమెట్రీ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించినా, 10వేల క్యూసెక్కులు మాత్రమే వెళ్లినట్టు లెక్కలు రాశారు. టెలిమెట్రీ వ్యవస్థ నమోదు చేస్తున్న రికార్డులను పరిగణనలోకి ఇపుడే తీసుకోవడం లేదని, ఇది ప్రయోగ దశలోనే ఉందని కెఆర్‌ఎంబి సభ్యులు అన్నారు. దానిపై తెలంగాణ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఇకపై ట్యాంపరింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని కెఆర్‌ఎంబి నామమాత్రపు హామీ ఇచ్చిందని వారి వాదనను తోసిపుచ్చినట్టు నీటి పారుదల అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్ర ఈఎన్‌సిలతో సమావేశం నిర్వహిస్తామని ఈ సందర్భంగా కెఆర్‌ఎంబి చైర్మన్ శ్రీవాస్థవ తెలిపారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ వద్ద ప్రవాహ వివరాలను ట్యాంపరింగ్ చేశారని నాగార్జున సాగర్ చీఫ్ ఇంజనీర్ ఎస్ సునీల్ సాక్ష్యాధారాలతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. నివేదికపై మంత్రి హరీశ్‌రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కె జోషి, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌లతో జలసౌధలో అత్యవసరంగా సమావేశం నిర్వహించి సమీక్షించారు. టెలిమెట్రీ పరికరాలను ఎర్పాటు చేస్తున్న మెకట్రానిక్స్ సంస్థ మొత్తం సమాచారాన్ని మార్పు చేసి పోతిరెడ్డిపాడు ప్రవాహాలను తక్కువ చేసి చూపించడం పట్ల హరీశ్ నిప్పులు చెరిగారు. అప్పటికపుడు ఆయన కెఆర్‌ఎంబి చైర్మన్ వాస్తవతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున నిరసన వ్యక్తం చేశారు. ట్యాంపరింగ్ చేసిన రీడింగ్‌లను తెలంగాణ ప్రభుత్వం అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కెఆర్‌ఎంబి శుక్రవారం సమావేశాన్ని నిర్వహించింది. సమావేశంలో చైర్మన్‌తోపాటు సభ్యుడు సుబ్బయ్య, టిఎస్ ఇరిగేషన్ ఇఎన్‌సి మురళీధరరావు, నాగార్జున సాగర్ సిఇ సునీల్, పోతిరెడ్డిపాడు ఎస్‌ఇ రాఘవరెడ్డి, ఇఇ శ్రీనివాసులురెడ్డి, మెకట్రానిక్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.