రాష్ట్రీయం

అనధికార హేచరీలపై కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, సెప్టెంబర్ 29: ఆంధ్రప్రదేశ్ రాష్టవ్రృద్ధిలో ప్రథమస్థానంలో నిలుస్తున్న ఆక్వా సాగు క్రమబద్ధీకరణలో భాగంగా అనధికార హేచరీలపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. సీడ్ దశలో వాడుతున్న యాంటీబయోటిక్స్ తదితర రసాయనాల కారణంగా రొయ్య ఎదిగి, ఎగుమతి చేసే సమయంలో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అనుమతి లేని హేచరీలను సీజ్‌చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలో ఈ తరహా చర్యలు మొదలయ్యాయి. రాష్ట్భ్రావృద్ధికి కీలకంగా మారడంతోపాటు, ఉపాధి అవకాశాలను గణనీయంగా కల్పించే ఆక్వా రంగంపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన సంగతి విదితమే. ఇప్పటికే త్రీఫేజ్ విద్యుత్‌ను అతి తక్కువ ధరకు ఆక్వా రైతులకు అందించడం వంటి చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం సాగును క్రమబద్ధీకరించాలని యోచిస్తోంది. ముఖ్యంగా ఎగుమతుల సందర్భంగా ఇతర దేశాల్లో ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తులకు మంచి ఇమేజ్ రావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఉన్నారు. ఇందులో భాగంగా స్టేజ్-1 పేరుతో నాణ్యతలేని సీడ్ (రొయ్య పిల్లలు) విక్రయిస్తున్న అనధికార హేచరీలపై కొరడా ఝళిపిస్తున్నారు.రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతంలోనే ఆక్వా సాగు ఎక్కువ. శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు ఆక్వా సాగు జరుగుతోంది. ఈ జిల్లాల్లో వనామి రొయ్యల సాగు ఎక్కువగా జరుగుతోంది. అయితే రైతులు తెలిసీ తెలియక అనాధికార హేచరీల నుంచి రొయ్య పిల్లలను కొనుగోలు చేస్తున్నారు. ధర తక్కువగా ఉండటం, అందుబాటులో ఉండటం తదితర కారణాల వల్ల రైతులు ఈ అనధికార హేచరీలపై ఆధారపడుతున్నారు.
నిబంధనల ప్రకారం హేచరీల ఏర్పాటుకు సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్ధ (ఎంపెడ), మత్య్సశాఖ, కోస్టల్ ఆక్వా కల్చర్ అధారిటీ అనుమతులు తప్పనిసరి. అయితే చాలా హేచరీలు ఈ నిబంధన పాటించడంలేదు. రైతులకు ఈ విషయం తెలియకపోవడంతో అనధికార హేచరీల్లో రొయ్య పిల్లలను కొనుగోలు చేసి అటు వైరస్, యాంటిబయోటిక్స్ వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. వైరస్ సోకితే రైతు మాత్రమే నష్టపోతాడు. అయితే యాంటిబయోటిక్స్ అంతకన్నా ప్రమాదకరంగా మారింది. యాంటీ బయోటిక్స్ వాడిన రొయ్యలపై వివిధ దేశాలు వెనక్కు పంపడంతోపాటు, ఆ తరహా ఉత్పత్తులు ఎగుమతిచేసే దేశాలపై నిషేధం సైతం విధిస్తున్నాయి.
రాష్ట్రంలో ఎంపెడ, మత్య్సశాఖ, కోస్టల్ ఆక్వా కల్చర్ అధారిటీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి పొందిన హేచరీలు సుమారు 200 మాత్రమే ఉన్నాయి. వీటిని అతి తక్కువమంది రైతులే ఉపయోగించుకుంటున్నారు. ఇక ప్రతీ జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన అనధికార హేచరీల హవాయే ఎక్కువ.
రాష్ట్ర ప్రతిష్ఠకు సంబంధించిన వ్యవహారం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. అనధికార హేచరీలను తొలగించాలని ఆదేశాలు జారీచేశారు. దీంతో పాటు యాంటిబయోటిక్స్ విక్రయించే మందుల దుకాణాలపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. వీటిని విక్రయించే వారికి కఠిన శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు.